Ads
సింహ, లెజెండ్ తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన మూడవ సినిమా అఖండ. దాంతో ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. అసలు ముందే రావాల్సిన అఖండ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ సినిమాతో వారిద్దరూ హ్యాట్రిక్ విజయం సాధిస్తారేమో అని అందరూ ఎదురుచూస్తున్నారు.
Video Advertisement
సినిమాకి ముఖ్య హైలెట్ మాత్రం బాలకృష్ణ. రెండు పాత్రల్లో, అది కూడా ముఖ్యంగా అఖండ పాత్రల్లో బాలకృష్ణ చాలా పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అఖండ మొదటి షో అయిన తర్వాత నుండే హిట్ టాక్ తెచ్చుకుంది.
ఈ సినిమాలో కనిపించిన ఎద్దుల జంట కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ ఎద్దుల జంట సినిమాలో బాగానే సందడి చేసింది. దర్శకుడు యాక్షన్ చెప్పాక బసవ అనే ఎద్దు కనిపిస్తుంది. యాక్షన్ సన్నివేశాలతో పాటు.. క్లైమాక్స్ లో బాలయ్య బాబుని కాపాడే సమయంలో కూడా ఈ ఎద్దుల జంట కీలక పాత్ర పోషిస్తాయి.
సినిమా విజయం సాధించడంతో ఈ సినిమా గురించి ప్రతి విషయంపైనా సోషల్ మీడియా లో చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ఈ ఎద్దుల కథ ఏంటి అన్నది చూద్దాం. బోయపాటి తన ఆలోచనలకు తగ్గట్లు ఉండే ఎద్దుల కోసం చాలా ప్రయత్నించారు. ఎన్ని చూసినా ఆయనకు నచ్చలేదు. చివరకు ఆయన సొంత జిల్లా గుంటూరు పెదకాకాని మండలం లో కొప్పు రావూరి చెందిన ఓ రైతు వద్ద ఉన్న ఎద్దుల జంట బోయపాటికి బాగా నచ్చేసింది. ఆయన వెంటనే వాటిని సినిమాలో పెట్టి షూట్ చేసారు. ఎద్దుల చేసిన విన్యాసాలు కూడా ప్రేక్షకులని బాగా అలరించేసాయి.
End of Article