Ads
పవన్ కళ్యాణ్ హీరో గా, దేవయాని హీరోయిన్ గా నటించిన సినిమా “సుస్వాగతం” గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులు అంత త్వరగా మర్చిపోలేరు. ఓ వైపు పిచ్చోళ్ళలా తిరిగే ప్రేమికులు ఎలా ఉంటారో చెబుతూనే, మరో వైపు వారి కోసం తండ్రి పడే తపనను చూపిస్తూ, వారికో గుణపాఠం నేర్పేలా ఈ సినిమాని మలిచారు.
Video Advertisement
ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రఘువరన్ తమ తమ పాత్రల్లో యాక్టింగ్ ను అదరగొట్టేసారు. ఈ సినిమాలో 1998 లో రిలీజ్ అయి సూపర్ హిట్ గా నిలిచింది. ఆ ఏడాది టాప్ మూవీస్ లో ఈ చిత్రం కూడా ఉంది. వాస్తవానికి ఇది తమిళ్ సినిమా “లవ్ టుడే” కి రీమేక్. ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ అవడం తో తెలుగు లో కూడా రీమేక్ చేసారు. ఈ సినిమా ని రీమేక్ చేయాలన్న ఆలోచన ఆర్బీ చౌదరి కి వచ్చింది.
ఈ సినిమా కి డైరెక్షన్ చేయడానికి శుభాకాంక్షలు సినిమా డైరెక్టర్ శ్రీనివాస్ రావు కరెక్ట్ అని ఆయన భావించారు. వెంటనే ఆయనను పిలిపించి ఈ సినిమాని డైరెక్ట్ చేయాల్సింది గా కోరారు. హీరో కోసం పలువురు పేర్లను పరిశీలించారు. తొలుత జెడి చక్రవర్తి, అబ్బాస్ ఇలా పలు పేర్లు అనుకున్నారు. పవన్ అప్పటికి ‘గోకులం లో సీత’ సినిమా చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆర్బీ చౌదరి పవన్ తొలుత నటించిన “అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి” మూవీ ప్రింట్ ను తెచ్చుకుని పవన్ కళ్యాణ్ ను ఫిక్స్ చేసేసారు.
ఆ తరువాత చిరంజీవి కి చెప్పి, పవన్ కి కూడా కథ వినిపించారు. పవన్ కూడా ఒకే చెప్పడం తో ఈ సినిమా షూటింగ్ మొదలైంది. తమిళం లో చేసిన రాశి నే హీరోయిన్ గా తీసుకోవాలనుకున్నారు. కానీ, అప్పటికి రాశి బిజీ గా ఉండడం తో దేవయానిని ఎంచుకున్నారు. ఈ సినిమాకి అన్ని పాత్రలు అతికినట్లు సరిపోయాయి. రఘువరన్ సమాధి దగ్గర పవన్ ఏడ్చే సీన్ కోసం ఎంత ప్రాక్టీస్ చేసారో తెలుసా? రెండు రోజులు ఏమి తినలేదు. దానితో బాగా నీరసం వచ్చేసింది. ఆ నీరసం లో ఉన్నప్పుడే కన్నీళ్లు పెడుతూ పవన్ ఈ షూట్ లో పాల్గొన్నారు. కేవలం ఈ సీన్ కోసమే పవన్ రెండు రోజులు ఏమి తినకుండా ఉన్నారు.
సెప్టెంబర్ లో పవన్ పుట్టినరోజు న ఈ సినిమా టైటిల్ ను ప్రకటించారు. ఎక్కువ భాగం విశాఖ లోను, హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లోను తీశారు. 1997 పవన్ మూడవ సినిమా మొదలైన రోజు బాలయ్య, వెంకటేష్, చిరంజీవి చీఫ్ గెస్ట్ లుగా వచ్చారు. ఆగష్టు లో రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ప్రతి సన్నివేశం లోను పవన్ ప్రాణం పెట్టి నటించినట్లు అనిపిస్తుంది. తండ్రి ప్రేమ, మరో వైపు ప్రియురాలు తిరస్కరణ వంటి వాటి మధ్య నలిగిబోతు పవన్ చూపించిన నటన ప్రతిభా ప్రేక్షకులతో కన్నీళ్లు పెట్టిస్తుంది. రఘువరన్ పాత్ర ను కూడా ప్రేక్షకులు ఇప్పటికి గుర్తుంచుకుంటారు.
ఈ సినిమాతో భీమినేని శ్రీనివాసరావ్ వరుస గా మూడో సినిమా హిట్ కొట్టారు. ఆలయన హారతి, ఏ స్వప్నలోకాన సౌందర్య రాశి వంటి పాటలు మారుమ్రోగిపోయాయి. ఇప్పటికీ ఈ పాటలకు అదే ఫాలోయింగ్ ఉంది. ఈ మూవీ తో పవన్ ఫాలోయింగ్ పీక్స్ లోకి వెళ్ళిపోయింది. ఈ సినిమా 49 సెంటర్లలో 50 డేస్ ఆడింది. 9 సెంటర్లలో వందరోజులు విజయవంతం గా ప్రదర్శించబడి, అప్పట్లోనే మొత్తం ఆరుకోట్ల షేర్లను రాబట్టింది.
End of Article