గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో సర్కారు వారి పాట సినిమా గురించే చర్చలు జరుగుతున్నాయి.. ప్రస్తుతం మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో భాగంగా అనేక ఇంటర్వ్యూలు ఇస్తోంది.. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో హీరో మహేష్ ఒక సంచలన విషయాన్ని బయట పెట్టారు..

Video Advertisement

మామ మహేష్ సాంగ్ చేసేటప్పుడు ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో వివరించారు.. అది ఏంటో ఒక సారి చూద్దాం..!! ఈ సాంగ్ చేసే సమయంలో మహేష్ బాబు షెడ్యూల్ కూడా పూర్తయిందని, చివరి సమయానికి వచ్చామని కనీసం చేసేంత ఎనర్జీ కూడా లేదన్నారు.

అప్పటికి అంతా కంప్లీట్ అయిపోయింది డబ్బింగ్ కూడా చెప్పేశారు. కానీ ఎలాగైనా ఒక మాస్ సాంగ్ పెట్టాలని మూవీ యూనిట్ భావిస్తున్నారు. ఈ క్రమంలో మహేష్ బాబు మళ్లీ కన్విన్స్ చేసి, మళ్లీ ఆ పాట షూట్ షాట్ చేశారట.. సెట్స్ కూడా పది రోజుల్లో వేసి ఆ సాంగ్ చేశారని మహేష్ బాబు అన్నారు. దీనికి ప్రధాన కారణం ఆ సాంగ్ కు తమన్ అందించిన మ్యూజిక్ బాగా అట్రాక్ట్ చేసిందని తెలియజేశాడు. కనీసం ఓపిక లేకున్నా ఆ సాంగ్ కంప్లీట్ చేశానని దీంతో చాలా రెస్పాన్స్ వచ్చిందని, అన్నిటికంటే ఎక్కువ ఎనర్జీ అందులోనే కనిపించిందని అన్నాడు.

 

పది రోజుల్లోనే సెట్స్ వేశారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ లో ఐదు రోజుల్లో పూర్తి పాటను కంప్లీట్ చేసి మహేష్ బాబు ఐదవ రోజు అబ్రాడ్ వెళ్ళిపోయారు. ఈ సినిమాలో ఇప్పటివరకు ఏ మూవీలో చేయని విధంగా పాత్ర కొత్తగా ఉందని ఆయన అన్నారు.. మూవీ కోసం యూనిట్ అంతా చాలా కష్టపడ్డారని తెలియజేశారు. ఈనెల 12వ తేదీన మూవీ థియేటర్లలోకి రానుంది కాబట్టి దాని భవితవ్యమేమిటో తెలిసిపోతుంది..