Ads
ఈ కాలంలో కూడా అమ్మాయిలకి డేరింగ్, డాషింగ్ ఉందని.. అమ్మాయిలు కూడా అన్నిటిలో ధైర్యంగా రాణించగలరని ఎందరికో ఆదర్శంగా నిలిచింది ఆటో అక్క. ప్రతి రోజు కూడా ఆటోని నడుపుతూ జీవనం సాగిస్తోంది. రోజంతా కూడా పనిచేస్తూ చాలా మందికి నమ్మకంగా నిలిచింది ఈ ఆటో అక్క.
Video Advertisement
పగలంతా ఆటో నడుపుకునే జీవనం సాగిస్తోంది. రాత్రి అయినా కూడా ఎవరైనా ఆడపిల్లలు ఇబ్బందిలో ఉన్నాం అని ఫోన్ చేస్తే చాలు.. పదినిమిషాల్లో వాలిపోతుంది. వారిని క్షేమంగా గమ్యం చేరుస్తుంది.
అర్ధరాత్రి సమయాల్లో పురిటి నొప్పులు వచ్చి ఇబ్బంది పడే ఆడవాళ్ళూ, ఆఫీసులో ఆలస్యమైతే క్యాబ్ ఎక్కడానికి భయపడే అమ్మాయిలూ.. ఇలా ఒకరేమిటి ఆపదలో ఉన్న ఎవరు ఫోన్ చేసి రమ్మని అడిగినా.. పది నిమిషాల్లో వాళ్ళ ముందు ఉంటుంది. ఆమె ఎవరో కాదు. ఆటో అక్క రాజి. వారిని క్షేమంగా గమ్యానికి చేర్చి, నేనున్నానంటూ ధైర్యం చెబుతుంది. అసలు అంత అర్ధరాత్రి కూడా ఆమె అంత ధైర్యంగా ఆటో నడపడడానికి ఓ కారణం ఉంది.
ఓ రోజు ఆమె భర్తతో పాటు వెళ్లి తిరిగి ఆలస్యంగా ఇంటికి వస్తోంది. ఆ సమయంలో ఓ ఆటోలో ఓ అమ్మాయి బాగా భయపడుతూ కూర్చుని ఉండడాన్ని గమనించింది. ఇలాంటి పరిస్థితుల్లో తానే ఓ ఆటో ఎందుకు నడపకూడదు అని అనుకుంది. భర్త ప్రోత్సాహంతోనే ఆటో నడపడం నేర్చుకుంది. పగలంతా తన బ్రతుకు తెరువు కోసం ఆటో నడుపుకునేది. రాత్రయితే.. ఇలా ఇబ్బందులు పడే అక్క చెల్లెళ్ళ కోసం ఆటో నడుపుతోంది. ఆర్ధిక వెసులుబాటు తో పాటు వృత్తిపర సంతృప్తి కూడా లభిస్తోందని సంతోషంగా చెబుతుంది ఈ ఆటో అక్క.
తన ఆటో లో ఎక్కిన ఆడవారికి తన ఫోన్ నెంబర్ ఇచ్చి ఎంత అవసరం అయినా అర్ధరాత్రి సమయాల్లో ఫోన్ చేస్తే వచ్చి గమ్యం చేరుస్తానని చెబుతూ ఉంటుంది. అయితే.. అర్ధరాత్రి సమయాల్లో లేచి ఆటో తోలినా.. తన భర్త ఏనాడూ అడ్డు చెప్పలేదని.. ఎంతో ప్రోత్సాహం అందించారని రోజీ సంతోషంగా చెప్పుకుంటారు. ఇక.. ఆడవారికి ఆటో నేర్పించే విషయంలో సరైన అవకాశాలు లేవని.. అందుకే ఎవరైనా కోరితే.. వారికి శిక్షణ కూడా ఇస్తున్నానని.. నెలకు 15 నుంచి 20 వేల వరకు సంపాదించుకుని ఆడవారు తమ కుటుంబానికి అండగా నిలవచ్చని ఆమె అభిప్రాయం వెలిబుచ్చారు. తన తోటి ఆడవారికి చేతనైనంత సాయం అందిస్తూ వస్తున్న ఈ ఆటో అక్కని అభినందిద్దామా మరి.
End of Article