వీధుల్లో బిచ్చమెత్తుకుంటూ చదివాడు…తర్వాత కేంబ్రిడ్జ్ లో సీటు సంపాదించాడు.!

వీధుల్లో బిచ్చమెత్తుకుంటూ చదివాడు…తర్వాత కేంబ్రిడ్జ్ లో సీటు సంపాదించాడు.!

by Mohana Priya

Ads

మనలో చాలా మందికి జీవితంలో ఎన్నో సాధించాలని, మంచి పేరు తెచ్చుకోవాలని ఇలా ఎన్నో కలలు ఉంటాయి. కానీ మధ్యలో ఇబ్బందులు ఎదురవడం వల్ల కొంత మంది వాళ్ళ కలలని వదులుకుంటారు. మరి కొంత మంది మాత్రం అవన్నీ అధిగమించి వాళ్ళు అనుకున్నది సాధిస్తారు.మనం ఇప్పుడు ఉన్న పరిస్థితి మనం భవిష్యత్తులో ఉండబోయే పరిస్థితుల్ని నిర్ణయించకూడదు అనేది దృష్టిలో పెట్టుకొని కష్టపడి ఒక స్థాయికి ఎదుగుతారు. జయ వేల్ కూడా ఇదే కోవకు చెందుతారు. వివరాల్లోకి వెళితే.

Video Advertisement

ఇండియా టుడే కథనం ప్రకారం జయ వేల్ వాళ్లది వ్యవసాయ కుటుంబం. 80 లలో పంటలు పాడైపోవడం తో నెల్లూరు నుండి చెన్నై కి వలస వచ్చారు. అక్కడ జయ వేల్ కుటుంబం యాచించడం (అడుక్కోవడం) మొదలు పెట్టారు.

తర్వాత జయ వేల్ ని వాళ్ల కుటుంబం బలవంతం చేయడంతో జయ వేల్ కూడా యాచించడం చేసేవారు. పేవ్మెంట్ మీద పడుకోవడం. వర్షం వస్తే అక్కడ ఉన్న షాప్ దగ్గరికి వెళ్లడం. పోలీసులు వచ్చి తరిమే అంత వరకు అక్కడే తలదాచుకోవడం  చేసేవారు.

జయ వేల్ తండ్రి చనిపోయిన తర్వాత తన తల్లి మద్యానికి బానిస అయ్యారు. వాళ్లకి వచ్చిన డబ్బులు అన్నీ ఎక్కువగా తన తల్లి తాగడం లోనే అయిపోయేవి. ఉమా ఇంకా ముత్తురామన్, సుయం చారిటబుల్ ట్రస్ట్ అనే ఎన్జీవో ద్వారా 1999లో జయ వేల్ కి చదువుకోడానికి సహాయం చేశారు.

తన 12 వ తరగతి పరీక్షలలో మంచి మార్కులతో పాస్ అయిన తరువాత, జయవేల్ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం ప్రవేశ పరీక్షను క్లియర్ చేశారు. “పెర్ఫార్మెన్స్ కార్ ఎన్‌హాన్స్‌మెంట్ టెక్నాలజీ ఇంజనీరింగ్” చదవడం కోసం వేల్స్ ‌లోని గ్లెన్డ్‌వర్ విశ్వవిద్యాలయంలో జయ వేల్ కి సీట్ ఆఫర్ చేశారు.

జయ వేల్ కి పై చదువులు అనేవి తను భవిష్యత్తులో కన్న కలలు నిజం చేసుకోవడానికి తోడ్పడే ఒక మెట్టు లాంటిదట. చదువు పూర్తయిన తరువాత తను కూడా ఒక ఎన్జీవో నడుపుతూ దాని ద్వారా ఎంతో మంది వీధి పిల్లలకు సహాయం చేయాలి అనుకుంటున్నారు. జయ వేల్ ఇలాగే కష్టపడి చదివి తన కలలను నిజం చేసుకోవాలి అని, భవిష్యత్తులో ఎంతో ఎత్తుకు ఎదగాలని ఆశిద్దాం.


End of Article

You may also like