చిన్న విషయాలకి కూడా తమ భాగస్వామితో గొడవ పడే ప్రతి ఒక్కరు… వీరి గురించి తప్పకుండా తెలుసుకోండి..!

చిన్న విషయాలకి కూడా తమ భాగస్వామితో గొడవ పడే ప్రతి ఒక్కరు… వీరి గురించి తప్పకుండా తెలుసుకోండి..!

by Anudeep

Ads

భార్య భర్తల బంధం అనేది ఎంతో మధురమైనది. ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటే జీవితాంతం ఎంతో సుఖమయంగా జీవిస్తూ ఉంటారు. ఒకరి పని ఒకరు గౌరవించుకుంటూ ఉన్నప్పుడే వారి సంసార జీవితం సవ్యంగా సాగిపోతుంది. ప్రపంచ మొత్తంలో మన వ్యక్తిగత ప్రశ్నలకు సమాధానం దొరికే ఒక మంచి ఫ్లాట్ ఫామ్ కోరా.

Video Advertisement

అయితే ఒక వ్యక్తి అడిగిన ప్రశ్నకు గోపీకృష్ణ విశ్వనాథ్ అనే వ్యక్తి  కోరా ద్వారా ఈ విధంగా సమాధానమిచ్చారు . ఇంతకీ ఆ ప్రశ్న  ఏంటంటే.. నా భార్యకు వంట రాదు.. ఆవిడ అంటే నాకు ఎంతో ప్రేమ. నేను ఏం చేయాలో చెప్పండి అంటూ కోరా ద్వారా ప్రశ్నను అడిగారు. గోపీకృష్ణ విశ్వనాథ్ ఆ ప్రశ్నకు ఈ విధంగా సమాధానం ఇచ్చారు. “ఆమెకు వంట రాకపోయినా పర్వాలేదు.

ఆమె మిమ్మల్ని ప్రేమిస్తే చాలు అదే సంతోషకరమైన వైవాహిక జీవితం గడపడానికి సరిపోతుంది. వంట అనేది రాకెట్ సైన్స్ తో సమానం ఏమీ కాదు.  ఇద్దరూ కలిసి అయిన నేర్చుకోవచ్చు. నాకు వంట చేయకపోయినా నా భార్య నన్ను పెళ్లి చేసుకుంది. డ్రైవింగ్ చేయలేకపోయినా ఆమెను నేను పెళ్లి చేసుకున్నాను. మేమిద్దరం సంతోషంగా పెళ్లి చేసుకున్న జంట. ఆమె నా కోసం వంట చేస్తుంది. నేను ఆమె కోసం ఆమె చుట్టూ తిరుగుతూ ఉంటాను. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగిపోతే వివాహ జీవితం అనేది ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇప్పుడైతే ఒకరిపై ఒకరు నిజమైన ప్రేమ ఉంటుందో వాళ్లకు వంట రాకపోయిన, వాళ్ళు ఇష్టంగా కష్టపడి మనకోసం వండే పదార్థాలు మనకు ఎంతో రుచిగా అనిపిస్తాయి” అంటూ సమాధానమిచ్చారు..


End of Article

You may also like