అంత సీరియస్ ఫైట్ సీన్ లో కోకోనట్ స్వీట్ ఏంటయ్యా…? నారప్ప సినిమాలో ఈ సబ్ టైటిల్ తప్పుగా పడింది గమనించారా?

అంత సీరియస్ ఫైట్ సీన్ లో కోకోనట్ స్వీట్ ఏంటయ్యా…? నారప్ప సినిమాలో ఈ సబ్ టైటిల్ తప్పుగా పడింది గమనించారా?

by Anudeep

Ads

అమెజాన్ ప్రైమ్ లో “నారప్ప” సినిమా దుమ్ము దులుపుతోంది. లాక్ డౌన్ సమయం లో సినిమా రిలీజ్ లు ఏమి లేకపోవడం తో ఎప్పుడు మంచి సినిమా రిలీజ్ అవుతుందా… హిట్ చేసేద్దాం అన్న హుషారులో ఆడియన్స్ ఉన్నారు. అంచనాలకు మించి రిలీజ్ అయిన “నారప్ప” మూవీ కి ప్రేక్షకులు బ్రహ్మ రధం పట్టేశారు. ఐతే.. సబ్ టైటిల్స్ విషయం లో మాత్రం సరిగ్గా చెక్ చేసుకోలేదని తెలుస్తోంది.

Video Advertisement

narappa

అదేంటో ఈ ఆర్టికల్ లో చూద్దాం. ఈ సినిమాలో పండుస్వామి కారణంగా నారప్ప పెద్ద కొడుకు చనిపోతాడు. అయినా.. సరే నారప్ప తన కోపాన్ని కంట్రోల్ చేస్కునే కుటుంబాన్ని కాపాడుకుంటూ వస్తుంటాడు. ఇక.. రెండో కొడుకు మాత్రం ఆవేశం అణుచుకోక పండుస్వామిని చంపేస్తాడు. దానితో.. పండుస్వామి కొడుకు నారప్ప కుటుంబాన్ని అంతం చేయాలనీ వెంటపడుతుంటాడు. చివరకు.. భూమి వదులుకోవడానికి నారప్ప సిద్ధపడి, పంచాయితీ లో సెటిల్మెంట్ చేసుకునే సమయం లో పండుస్వామి మనుషులు నారప్ప కొడుకు చుట్టుముడతారు.

narappa

ఈ సమయం లోనే నారప్ప గా వెంకీ మామ విశ్వరూపం చూపిస్తుంటాడు. కొడుకుని కాపాడుకునే ప్రయత్నం లో నారప్ప ఫైట్ చేస్తుండగానే.. రెండో కొడుకు శీనప్ప పై కత్తి పోటు పడుతుంది… ఆ అబ్బాయి చాలా ఎమోషనల్ గా “నాన్నా” అని పిలుస్తాడు. ఆ సీన్ అంత ఎమోషనల్ గా పండింది. కానీ.. సబ్ టైటిల్స్ లో మాత్రం.. ఆ పిల్లాడు “నాన్నా” అని పిలిచే చోట “ఐ వాంట్ కోకోనట్ స్వీట్” (నాకు కొబ్బరి స్వీట్ కావాలి) అని పడుతుంది. నిజానికి ఈ సబ్ టైటిల్ ఆ తరువాత కోర్ట్ సీన్ వద్ద పడాలి. కానీ, చూసుకోకపొవడం వలన ఇక్కడ కూడా పడింది.

narappa

అంత సీరియస్ సీన్ లో ఈ సబ్ టైటిల్ ఏంట్రా బాబు అంటూ ఈ విషయమై సోషల్ మీడియా లో ట్రోల్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఒక్కోసారి చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఇది కూడా అలాంటిదే. కానీ.. రిలీజ్ చేసే ముందు చూసుకుని ఉండి ఉంటె బాగుండేది.


End of Article

You may also like