ఆమె భర్త ఆస్తి 36000 కోట్లు.. కానీ 30 సంవత్సరాల నుంచి ఒక చీర కూడా కొనుక్కోలేదు.. ఎందుకో తెలుసా?

ఆమె భర్త ఆస్తి 36000 కోట్లు.. కానీ 30 సంవత్సరాల నుంచి ఒక చీర కూడా కొనుక్కోలేదు.. ఎందుకో తెలుసా?

by Harika

Ads

సుధా మూర్తి పరిచయం అక్కర్లేని ఈ మాతృమూర్తి గురించి తెలుసుకోవాల్సిన, నేర్చుకోవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు, భర్త అయిన నారాయణమూర్తి కోసం తన కెరీర్ ని త్యాగం చేసిన వ్యక్తి సుధా మూర్తి. భర్త వేలకోట్ల అధిపతి అయినప్పటికీ ఆమె సాధారణ జీవితాన్ని గడపడానికే ఇష్టపడతారు. తను చీరలు కూడా చాలా తక్కువ ఖరీదు చీరలు కట్టుకోవటానికి ఇష్టపడతారు.

Video Advertisement

పదివేల రూపాయలు పెట్టి చీర కొంటే పదివేల సార్లు కట్టుకోము కదా, 2000 ఖర్చు చేసే చేరుకుంటే 20 సార్లు లేదా 30 సార్లు లేదా 50 సార్లు కట్టుకుంటాము. నిజానికి ఖరీదు తక్కువ అయినదాన్నే ఎక్కువగా ఉపయోగిస్తామని ఆమె చెబుతారు. అవసరానికి మించిన వస్తువులు ఉండవలసిన అవసరం లేదు అంటారు 73 ఏళ్ల సుధా మూర్తి. ఈమె గత 30 సంవత్సరాలుగా తనకోసం ఒక్క చీర కూడా కొనుక్కోలేదంటే ఆమె సింప్లిసిటీ ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు.

అప్పుడప్పుడు ఎన్జీవోలు, స్నేహితులు ఇచ్చిన చీరలను మాత్రమే ఆమె కట్టుకుంటారు. ఆమె చీరలు కొనుక్కోకపోవడానికి ఆమె చేసిన ప్రతిజ్ఞ కారణం. వారణాసిలో ఆమె షాపింగ్ లోని వదులుకుంటాను అని ప్రతిజ్ఞ చేసింది. తనకి షాపింగ్ అంటే చాలా ఇష్టం అంట, కాశీకి వెళ్ళినప్పుడు మనసుకు నచ్చినది వదిలేయమంటే షాపింగ్ ని వదిలేసాను అని 2018 లో ఆమె ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

తన భర్త 36,690 కోట్ల ఆస్తికి వారసుడు అందులో ఆమె 775 కోట్లు షేర్ ఉంది. ఆమె అల్లుడు అమెరికా ప్రెసిడెంట్. ఇంతటి ఆస్తి ఉన్న ఆమె సింపుల్ లైఫ్ని లీడ్ చేయడం నిజంగా ఆమె ఉన్నత భావాలకి నిదర్శనం. ప్రస్తుతం సుధా మూర్తి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా సామాజిక కార్యకర్త, ఉపాధ్యాయురాలు, రచయిత కూడా అని అందరికీ తెలిసిందే. ఈమె చేసిన సమాజసేవలకు 2006లో పద్మశ్రీ అవార్డు, 2023లో పద్మభూషణ్ అవార్డు ఆమెను వరించింది.


End of Article

You may also like