జేబులో కొన్ని డబ్బులు ఉంటే చాలు నేల మీద కాలే నిలవదు. చాలా మందికి కాస్త డబ్బులు వచ్చే సరికి ఎక్కడా లేని డాబు వచ్చేస్తుంది. నాలుగు రూపాయలు ఉండే సరికి ఘోరంగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు ఇక భవిష్యత్తు గురించి కూడా ఆలోచన ఉండదు. పైగా ఎవరు గుర్తు రారు. డబ్బు ఉన్నంతసేపు వాళ్లకి నచ్చినది చేసేసి ఎవరిని కనీసం పట్టించుకోరు. కళ్ళు నెత్తికెక్కేస్తాయి.

Video Advertisement

ఒక్కసారిగా విపరీతమైన స్టైల్ కొడుతూ ఉంటారు చాలామంది. కానీ సుధా మూర్తి గారిని చూసే వీళ్లంతా నేర్చుకోవాలి.

ఇన్ఫోసిస్ చైర్ పెర్సన్ సుధా మూర్తి గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. అందరికీ తెలిసిందే. రచయితగా, వక్తగా, సామాజిక సేవకురాలుగా ఈమె ఎంతో గుర్తింపుని తెచ్చుకున్నారు. సోషల్ మీడియాలో ఈమె తాజా ఫోటోలను చూసి ప్రతి ఒక్కరు కూడా అవాక్కవుతున్నారు. ఏంటి సుధా మూర్తి యేనా ఆమె ఏంటి ఇలా ఉన్నారు అని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఈమె పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి భార్య ఈమె. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అత్తయ్య. అయినా కూడా ఆమెలో ఎలాంటి గర్వం లేదు.

ఎంతో సింపుల్ గా ఉన్నారు. చూసిన వాళ్లంతా కూడా ఈమె ని చూసి నేర్చుకోండి అని అంటున్నారు. తిరువనంతపురంలో అట్టుకల్ భగవతి ఆలయంలో ఒక సామాన్యురాలిగా ఈమె కూర్చుని పొంగలిని వడ్డించారు. కాసేపు ఆమె ప్రసాదం వితరణ చేశారు. వేలాది మంది భక్తులు అక్కడ ఉన్నారు. ప్రసాదం తయారు చేయడంలో కూడా ఈమె సహాయం చేశారు. అక్కడ ఉన్న మహిళలతో ఎంతో సింపుల్ గా సాధారణంగా మాట్లాడారు.

ఈ వేడుకల్లో ఈమె పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచారు. పొంగల్ వేడుక నారి శక్తికి నిదర్శనమని సుధా మూర్తి అన్నారు. కులం ప్రాంతం పేద ధనిక అని తేడాలు ఉండవని ఇక్కడ లేవని చెప్పారు. అందరూ కూడా ఒకటే అని సందేశాన్ని ఇచ్చారు సుధా మూర్తి. సుధా మూర్తి ఒక సామాన్యురాలుగా ఎంతో సింపుల్ గా కనపడ్డారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.