కమెడియన్ గా పరిచయమై ఇప్పుడు హీరోగా సినిమాల్లో చేస్తున్నాడు సుధీర్. జబర్ధస్త్ కామెడీ షోతో ప్రేక్షకుల కి దగ్గరయ్యాడు. సుడిగాలి సుధీర్ గా అందరినీ నవ్వించేవాడు. అలానే ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రామ్స్ కూడా చేసే వాడు. ఈ ప్రోగ్రామ్స్ ద్వారా టెలివిజన్ ప్రేక్షకులకి ఇంకాస్త దగ్గరయ్యాడు. పాపులారిటీ ని కూడా సంపాదించుకున్నాడు.

Video Advertisement

సుధీర్ హీరోగా ఇప్పుడు వచ్చిన మూవీ గాలోడు. ఈ మూవీ సక్సెస్ అయ్యింది. ఈ మాస్ అండ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ సినిమాలో గెహ్నా సిప్పి సుధీర్ సరసన నటించి అందరినీ ఆకట్టుకుంది.

యూత్‌ లో క్రేజ్ కూడా సుధీర్ కి ఎక్కువగానే వుంది. గాలోడు సినిమా కి చక్కటి రెస్పాన్స్ వచ్చింది. ఓపెనింగ్స్ కూడా బాగున్నాయి. తెలంగాణ, ఏపీ లోని బీ,సీ సెంటర్స్‌లో ఈ మూవీ కి రెస్పాన్స్ అదిరిపోయింది. ఈ మధ్యన సినిమాలు చేసిన పెద్ద హీరోల సినిమాలే మెప్పించ లేదు. పాపులారిటీ ఉన్న వాళ్ళ సినిమాలే ఆడలేదు కానీ సుధీర్ మూవీ కి సూపర్ రెస్పాన్స్ రావడం అనేది గొప్ప విషయమే. ఇది వరకు సుధీర్ రెండు సినిమాలలో హీరోగా చేసాడు. కానీ రెండూ నిరాశే మిగిల్చాయి. ఈసారి గాలోడు మూవీ తో తన అదృష్టాన్ని పరీష్కరించుకోగా.. సక్సెస్ వచ్చింది.

ఇక ఈ మూవీ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ క్లోజింగ్ కలెక్షన్స్ గురించి చూస్తే మొదటి రోజే అన్ని చోట్ల సుమారు రూ.50 లక్షల నుంచి రూ. 75 లక్షల వరకు షేర్ రాగ రూ.కోటి నుండి కోటిన్నర వరకు గ్రాస్ ని ఈ మూవీ రాబట్టింది. 2.70 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసారు. మూడు కోట్లు ఈవెన్ టార్గెట్ పెట్టుకొని సినిమా ని తీసుకు వచ్చారు. మొదటి ఆరు రోజుల్లోనే అది క్రాస్ చేసారు. సినిమా లాభాల్లోకి వచ్చింది. 3.10 కోట్ల గ్రాస్ తెలంగాణ (నైజాం), రూ. 1.26 కోట్ల గ్రాస్ రాయలసీమ (సీడెడ్), 4.75 కోట్ల గ్రాస్ ఆంధ్ర ప్రదేశ్‌లో రాబట్టనుంది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ కలిపి రూ. 9.71 కోట్ల గ్రాస్ వచ్చింది. కర్ణాటక, ఓవర్సీస్, రెస్టాఫ్ భారత్ రూ. 20 లక్షలు, ప్రపంచ వ్యాప్తంగా రూ. 9.91 కోట్ల గ్రాస్ వచ్చింది.