CALLING SAHASRA REVIEW: “సుడిగాలి సుధీర్” కి ఈ సినిమాతో హిట్ పడినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

CALLING SAHASRA REVIEW: “సుడిగాలి సుధీర్” కి ఈ సినిమాతో హిట్ పడినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Mounika Singaluri

Ads

బుల్లితెర పైన జబర్దస్త్ తో తనకంటూ ఒక ఇమేజ్ సంపాదించుకున్న సుడిగాలి సుదీర్ తర్వాత హీరోగా టర్న్ అయ్యి పలు సినిమాల్లో నటించాడు. అవి పెద్దగా హిట్ అవ్వకపోయినా వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. అయితే తాజాగా కాలింగ్ సహస్ర అంటూ ఒక థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఈ మూవీ ఎలా ఉందో రివ్యూ చూసి తెలుసుకుందాం.

Video Advertisement

  • చిత్రం: కాలింగ్ సహస్ర
  • నటీనటులు: సుడిగాలి సుదీర్ డాలీషా శివబాలాజీ స్పందన తదితరులు
  • డైరెక్టర్: అరుణ్ విక్కీరాల
  • నిర్మాతలు: వెంకటేశ్వర్లు కాటూరి, విజేష్ తయల్, చిరంజీవి పమిడి.
  • డిఓపి: సన్నీ
  • సంగీతం: మోహిత్ రెహమానిక్
  • విడుదల తేదీ: డిసెంబర్ 1

కథ:

అజయ్ శ్రీవాస్తవ (సుడిగాలి సుధీర్) సైబర్ సెక్యూరిటీ ఎక్స్ పర్ట్ .హైదరాబాదులో తన మిత్రుడి కంపెనీలో కొత్తగా ఉద్యోగంలో చేరతాడు. తన అక్క హత్య తాలూకు జ్ఞాపకాలు అతడిని వెంటాడుతుంటాయి. ఆమెలా మరో అమ్మాయికి అన్యాయం జరగకూడదని రెస్క్యూ అనేఆపరేషన్ ను కనిపెడతాడు.ఇదిలా ఉండగా అజయ్ ఓ రోజు కొత్తగా సిమ్ కొనుగోలు చేస్తాడు. అది తన సెల్ లో వేసుకున్నప్పటి నుంచి వరుస ఫోన్లు వస్తుంటాయి. ఆ చేసేవాళ్లంతా సహస్ర కోసమే ఆరా తీస్తుండడంతో అజయ్ అయోమయానికి గురవుతాడు. దీంతో అసలు సహస్ర ఎవరు?ఆమెకు ఏమైంది అని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. మరి ఆ తర్వాత ఏమైంది. సహస్ర ఎవరు. అజయ్ తో ఆమెకు ఉన్న సంబంధమేంటి?అజయ్ అక్క చావుకు సహస్ర కనిపించకుండా పోవడానికి ఏమైనా లింకు ఉందా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.


విశ్లేషణ:

ఇది రెగ్యులర్ గా చూసే ఓ సగటు సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమే. డార్క్ వెబ్ మాటున జరిగే ఓ క్రైమ్ ఎలిమెంట్ ను దీనికి జోడించి కొత్తదనం అద్దే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అలాగే ఈ పాయింట్ ను రెండు ప్రేమ కథల మధ్య ఇరికించి కాస్త భిన్నంగా చూపించాలనుకున్నాడు. ఈ రెండు ప్రయత్నాల్లో ఏ ఒక్కటి తెరపైన సరైన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. ప్రేమ కథలో కొత్తదనం లేదు, క్రైమ్ చూపించిన తీరు మరి చప్పగా సాగింది. ఈ సినిమాలో సైబర్ క్రైమ్ ఎలిమెంట్ ఉన్నప్పుడు హీరో సైబర్ ఎక్స్ పర్ట్ అయినప్పుడు క్రైమ్ కనిపెట్టడానికి హీరో వేసి ఎత్తుగడలు వాటిని అతడు చేధించే తీరు ఆసక్తికరంగా ఉండాలి. కానీ దీంట్లో ఆ తరహా ప్రయత్నాలు కనిపించవు.

పైగా కథకు అక్కడక్కడ హర్రర్ టచ్ ఇచ్చి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించారు. ఇక సీరియల్ ను తలపిస్తు సాగే కథనం పరీక్ష పెడుతుంది. డార్క్ వెబ్ లో లూసిఫర్ అనే ముఠా చేస్తున్న క్రైమ్ ఎలిమెంట్ ను చూపిస్తూ సినిమా కాస్త ఆసక్తికరంగానే మొదలవుతుంది. రెగ్యులర్ ఫైట్ తో సుధీర్ పాత్రను పరిచయం చేశారు. తర్వాత లవ్ ట్రాక్ పట్టాలెక్కించారు. ఇంటర్వెల్ కి వెళ్ళేసరికి కథ కదులుతుంది. ద్వితీయద్దంలో సహస్త్ర ఎవరు? ఆమెకు జరిగిన అన్యాయం ఏమిటి అనే కోణంలో కథ సాగుతుంది. లూసిఫర్ పేరుతో నేరాలు చేస్తున్న వ్యక్తి ఎవరన్నది సినిమా ఆరంభంలోనే ప్రేక్షకులకు అర్థమైపోతుంది. దీంతో ముగింపు ఏమాత్రం ఆసక్తి రేకెత్తించదు. ఇక నటీనటుల విషయాలకు వస్తే సుడిగాలి సుధీర్ సహజమైన నటనతో ఆకట్టుకున్నాడు.

కథానాయకులుగా స్పందన, డాలీషాలు అందంగా కనిపించారు. ఇద్దరి పాత్రలకు కథలో ప్రాధాన్యత ఉంది. శివ బాలాజీ పాత్ర కాస్త సర్ప్రైజింగ్ గానే ఉంటుంది కానీ ప్రేక్షకులు ముందే పసిగట్టేస్తారు. ఇక మిగిలిన పాత్రలన్నీ తమ పరిధిలో నటించాయి. దర్శకుడు రాసుకున్న కథలో క్రైమ్ ఎలిమెంట్ కొత్తగా ఉన్నా, దాన్ని ఆసక్తికరంగా ప్రెజెంట్ చేయడంలో విఫలమయ్యాడు. నేపథ్య సంగీతం పరవాలేదు గాని పాటలు గుర్తుంచుకునేలా లేవు. ఛాయాగ్రహణం సినిమాకి తగ్గట్టు ఉంది. నిర్మాణ విలువలు అంతంత మాత్రమే.

ప్లస్ పాయింట్స్:

1.సుడిగాలి సుధీర్ నటన
2.మధ్య మధ్యలో వచ్చే ట్విస్టులు

మైనస్ పాయింట్స్:

1.కథా నేపథ్యం
2.బోర్ కొట్టించే సన్నివేశాలు
3.ముగింపు

రేటింగ్: 1.75/5

ఫైనల్ గా: కాలింగ్ సహస్రలో సహస్ర ఉంది గాని, పెద్దగా థ్రిల్లింగ్ అనిపించేలా లేదు..!

 

Watch Trailer:


End of Article

You may also like