ఈ టీవీ సంక్రాంతి పండుగ స్పెషల్ ఈవెంట్ లో “సుధీర్” మిస్సింగ్…కారణం ఏంటో.?

ఈ టీవీ సంక్రాంతి పండుగ స్పెషల్ ఈవెంట్ లో “సుధీర్” మిస్సింగ్…కారణం ఏంటో.?

by Anudeep

Ads

ఈటివి, మల్లె మాల, సుధీర్.. వెంటవెంటనే మదిలో మెదులుతాయి. సుధీర్ కు ఈటివి కి ఉన్న అనుబంధం అలాంటిది. తనకు మొట్ట మొదటి అవకాశాన్ని ఇచ్చిన ఈటివి ని సుధీర్ వదులుకోరు. తనకు మల్లెమాల అన్నం పెట్టింది అని ఇప్పటికి పలు షో లలో సుధీర్ గుర్తు చేసుకుంటూనే ఉంటారు. తానిప్పుడు బుల్లితెర సూపర్ స్టార్. డాన్స్, కామెడీ, స్పాంటేనియటి, యాక్టింగ్, ఎమోషన్.. వాట్ నాట్.. అన్ని తాను సింగల్ హ్యాండ్ తో నడిపించే సత్తా ఉన్నవ్యక్తి సుధీర్. అందుకే సుధీర్ కి అంత ఫ్యాన్ ఫాలోయింగ్.. అలాంటి డౌన్ టు ఎర్త్ పర్సన్ సుధీర్ ఈటివి లో రాబోయే సంక్రాంతి పండుగ స్పెషల్ ఈవెంట్ “అత్తో అత్తమ్మ కూతురో” ఈవెంట్ లో మిస్ అయ్యాడు.

Video Advertisement

atto attammakuturo

ఈటివి లో మల్లె మాల నిర్వహించే ప్రతి షో లో సుధీర్ కచ్చితం గా ఉంటాడు. సుధీర్, రష్మీ జంట కోసమే ఆ షో లను చూసే అభిమానులున్నారంటే అతిశయోక్తి కాదు. సుధీర్ ఫాలోయింగ్ కి వేరే ఛానెళ్ల నుంచి కూడా చాలా ఆఫర్లు వచ్చేవి. కానీ, సుధీర్ వాటన్నిటిని వదులుకుని ఈటీవీకే పరిమితం అయ్యారు. జబర్దస్త్, ఢీ షోలలో కనిపించే సుధీర్ తన టాలెంట్ ను ప్రదర్శిస్తూనే ఉంటారు. అయితే, ఢీ షో లో తనపై ఎన్ని సెటైర్లు వేసినా నవ్వుతూనే స్వీకరిస్తూ అభిమానులకు వినోదం పంచె ఔన్నత్యం అతని సొంతం.

అతని కామెడీ టైమింగ్ లేకుండా “అత్తో అత్తమ్మ కూతురో” షో ప్రోమో ని రిలీజ్ చేయడం తో అభిమానుల్లో కలవరం మొదలైంది. సుధీర్ ఎక్కడా? అని చూస్తున్నారు. ఈ షో లో రోజా, అనసూయ, ఆది, ప్రదీప్, ఇమ్మాన్యుయేల్, వర్ష, రౌడీ రోహిణి, గెటప్ శీను, ఆటో రామ్ ప్రసాద్, రష్మీ, నరేష్ తో సహా ఎప్పుడు ఉండే సందడి బ్యాచ్ అంతా ఉన్నారు. ఒక్క సుధీర్ తప్ప.

sudheer

అయితే, వేరే ప్రోగ్రామ్స్ తో సుధీర్ బిజీ గా ఉండడం వల్లనే, ఈ షో లో సుధీర్ పార్టిసిపేట్ చేయడానికి అవకాశం దొరకలేదని సమాచారం. అందుకే ఈ ఈవెంట్ లో సుధీర్ కనిపించడం లేదని, అంతకంటే వేరే కారణమేమి లేదని తెలుస్తోంది. ఇప్పటివరకు ఈటివి లో ఏ ఈవెంట్ జరిగినా.. అందులో సుధీర్ రష్మీ జోడి పక్కా ఉంటుంది. సుధీర్ కూడా ప్రతి ప్రోగ్రాం లో పాల్గొనే విధం గా నిర్వాహకులు చూసుకునే వారు. ఈ సారి ఈవెంట్ లో మాత్రం సుధీర్ ను కచ్చితం గా మిస్ అవుతాం. సుధీర్ లేని లోటు తెలుస్తుంది. సుధీర్ ప్రస్తుతం వరుస అవకాశాలతో బిజీ అవుతున్నారు. వెండితెర పై కూడా ఆయన తన ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు.

 


End of Article

You may also like