గాలోడు సినిమాకి సుడిగాలి సుధీర్ తీసుకున్న రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా?

గాలోడు సినిమాకి సుడిగాలి సుధీర్ తీసుకున్న రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా?

by kavitha

Tollywood: సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన ‘గాలోడు’ చిత్రం గత శుక్రవారం విడుదల అయ్యింది. ఈ సినిమాను రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బి, సి సెంటర్లలో పాజిటివ్ టాక్‌తో నడుస్తోంది. గాలోడు విడుదలైన మొదటి రోజునే రూ.1.01 కోట్ల గ్రాస్‌ని రాబట్టింది. ఈ చిత్రం ఇప్పటివరకు రూ.2 కోట్ల మార్క్‌ని కూడా దాటేసినట్లు సమాచారం. సుడిగాలి సుధీర్ జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ తదితర ప్రోగ్రామ్స్ ద్వారా టీవీ ప్రేక్షకులకి బాగా చేరవై, యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.

Video Advertisement

సుధీర్‌ గాలోడు మూవీకి భారీ రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు టాలీవుడ్‌లో ఓ వార్త షికారు చేస్తోంది. ఈ సినిమా కోసం దాదాపు ఆరు నెలలు పాటు జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీకి దూరంగా ఉన్న సుడిగాలి సుధీర్ యాబై లక్షలు రెమ్యూనరేషన్ తీసుకున్నారని సమాచారం. నిజానికి టివి షోల నుండి వచ్చిన సుధీర్‌కి గాలోడు రెండో సినిమానే. అతని తొలిచిత్రం ‘సాప్ట్‌వేర్ సుధీర్’కి కూడా రాజశేఖర్ రెడ్డి పులిచర్లనే దర్శకత్వం వహించారు. కానీ ఆ సినిమా నిరాశ పరిచింది.

gaalodu

గాలోడు సినిమాకి సాప్ట్‌వేర్ సుధీర్ మూవీతో పోలిస్తే కొంచెం బెటర్ అని చెప్తున్నాయి రివ్యూలు. ఈ సినిమాలో సుధీర్‌కి బాగా ఎలివేషన్స్ పడ్డాయి. అయితే కథ విషయంలో ఇంకొంచెం కసరత్తు చేసుంటే బాగుండని అని విమర్శకుల అభిప్రాయం. బుల్లితెర నుంచి వచ్చిన నటుడికి యాబై లక్షలు అంటే భారీ రెమ్యూనరేషన్ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


You may also like

Leave a Comment