దంగల్ నటి “సుహానీ భట్నాగర్” పోస్ట్ మార్టంలో బయటపడ్డ నిజాలు..! 10 రోజుల క్రితమే ఆ వ్యాధి.?

దంగల్ నటి “సుహానీ భట్నాగర్” పోస్ట్ మార్టంలో బయటపడ్డ నిజాలు..! 10 రోజుల క్రితమే ఆ వ్యాధి.?

by kavitha

Ads

బాలీవుడ్ బాలనటి సుహానీ భట్నాగర్ మరణంతో ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.  చిన్న వయసులోనే సుహానీ అరుదైన వ్యాధితో కన్నుమూసింది. ఆమె ఢిల్లీలోని ఎయిమ్స్ లో ట్రీట్మెంట్ తీసుకుంటూ, తుది శ్వాస విడిచింది.

Video Advertisement

2016లో  బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ‘దంగల్’ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీని ప్రముఖ కుస్తీవీరుడు మహావీర్ సింగ్ ఫోగాట్ మరియు అతని కుమార్తెల లైఫ్ ఆధారంగా రూపొందించారు. ఈ సినిమాలో బాలనటిగా నటించిన సుహానీ భట్నాగర్ బబిత కుమారి పాత్రలో నటించి, మెప్పించింది.

సుహానీ భట్నాగర్  19 సంవత్సరాల వయసులో కన్నుమూయడంతో బాలీవుడ్ లో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. సుహానీ భట్నాగర్ అరుదైన వ్యాధికి గురై చనిపోయినట్లు ఆమె తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకున్నారు. 2 నెలల కిందట సుహానీకి  అరుదైన ‘డెర్మాటోమయోసిటిస్’ లక్షణాలు కనిపించాయని, అయితే 10 రోజుల క్రితమే ఆ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయినట్లుగా వారు తెలిపారు.

ఈ వ్యాధి లక్షణాలు కనిపించగానే సుహానీని ఫిబ్రవరి 7న ఎయిమ్స్ లో చేర్పించి,  చికిత్స అందించినట్లు వెల్లడించారు. పరిస్థితి విషమించడంతో ట్రీట్మెంట్ పొందుతూ ఫిబ్రవరి 16న కన్నుమూసినట్లు చెబుతూ కన్నీటి పర్యంతం అయ్యారు. ఆమె పోస్ట్ మార్టం రిపోర్ట్ లోని విషయాలను డాక్టర్లు  వెల్లడించారు. సుహానీ డెర్మాటోమయోసిటిస్ అనే రేర్ ఇన్ఫ్లమేటరీ డిసీస్ తో బాధపడింది. దీనివల్ల రోగనిరోధక శక్తి  తగ్గిపోయి, లంగ్స్ ఇన్ ఫెక్షన్ కి గురైంది. దీంతో శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో ప్రాణాలు విడిచిందని వివరించారు.

ఇప్పటికే సుహానీ చాలా టార్చర్ పడిందని, ఫ్యూచర్ లో మరిన్ని ఇబ్బందులు పడాల్సి వచ్చేదని వైద్యులు తెలిపారు. ‘డెర్మాటోమయోసిటిస్’ అనేది చాలా అరుదైన వ్యాధి. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి బారిన పడేవారు ఆరుగురు లేదా ఏడుగురు మాత్రమే ఉంటారని అన్నారు. అలాగే ఇది ఏ వయసులో అయినా వచ్చే అవకాశం ఉందని అన్నారు.

Also Read: షూటింగ్ పూర్తి అయినా ఇప్పటికీ విడుదల కాని 10 సినిమాలు…ఈ లిస్ట్ ఓ లుక్ వేయండి.!


End of Article

You may also like