సుఖేష్ చంద్రశేఖర్ గురించి మీరు వినే ఉంటారు. కర్ణాటక లోని బెంగళూరుకి చెందిన వ్యక్తి సుఖేష్. తను విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి 17 ఏళ్ల నుంచి కూడా అందరిని మోసం చేస్తున్నాడు. వ్యాపారవేత్తల మొదలు బాలీవుడ్ ప్రముఖుల దాకా ప్రతి ఒక్కరిని కూడా మోసం చేయడం మొదలుపెట్టారు సుఖేష్.

Video Advertisement

2007లో బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చాలా మందిని మోసం చేశాడు. దాంతో అరెస్ట్ కూడా అయ్యాడు. అయినా కూడా మారలేదు. దాదాపు 30 కి పైగా కేసులు ఇతని మీద నమోదయ్యాయి. వైయస్సార్ రెడ్డికి మేనల్లుడు అని చెప్పుకొని అందరినీ మోసం చేస్తూ ఉంటాడు.

sukesh chandrashekar letter to jacqueline fernandez

 

అలానే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కొడుకు అని కూడా చెప్పుకుంటాడట. నకిలీ స్కీమ్స్ ద్వారా 450 మందిని మోసం చేసి కోట్ల రూపాయలని కాజేసాడు. సుఖేష్ కి జాక్వెలింగ్ కి మధ్య సంబంధం ఉండడంతో ఆమెకి కోట్ల విలువ చేసే బహుమతులని ఇచ్చాడు. హోలీ సందర్భంగా ఆమెకి ఒక లెటర్ రాశాడు.

అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మై బొమ్మ మై జాకీ అని సంబోధిస్తూ ఉత్తరాన్ని రాశాడు. ఈ ఉత్తరంలో తన జీవితంలో రంగుల్ని నింపుతానని సుఖేష్ రాసాడు. చాలా బాగా మిస్ అవుతున్నాను అని తనకి ఆమె ప్రపంచమని రాశాడు. హోలీ విషెస్ ని చెప్పాడు అలానే తన జీవితంలో పోయిన రంగుల్ని తిరిగి తీసుకొస్తానని.. అది తన బాధ్యత అని కూడా రాశాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని… నవ్వుతూ నువ్వు ఉండాలని కోరుకుంటున్నానని రాశాడు చంద్రశేఖర్.

లవ్ యు మై ప్రిన్సెస్.. మిస్ యు అని రాసి మై జాకీ, మై బొమ్మ అని ఆమెని సంబోధించాడు. మనీ లాండరింగ్ కేసులో సుఖేష్ ఇప్పుడు తీహార్ జైల్లో ఉన్నాడు. 200 కోట్లు మనీ లాండరింగ్ కి పాల్పడినట్లు అభియోగాలను ఎదుర్కొంటున్నాడు. ఈడి ఇప్పటికీ ఇతని మీద మూడు కేసులు నమోదు చేయడం జరిగింది. కేంద్ర హోమ్ లా సెక్రెటరీగా నటించాడు. మాజీ రెలిగేర్ ప్రమోటర్ మాల్వీన్దర్ సింగ్ భార్యని మోసం చేసి 200 కోట్లని కాజేసాడు. జాక్వెలిన్ కి 7 కోట్ల వరకు ఇచ్చాడట. అయితే జాక్వెలన్ కి ఈ కేసులో సంబంధం లేనట్లు సుఖేష్ చెప్పాడు. ఆమె మాత్రం అతను తన జీవితాన్ని నాశనం చేశాడని చెప్పింది.