ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఉన్న యాంకర్లలో ఎంతో పేరు సంపాదించిన యాంకర్ సుమ అంటే తెలియని వారు ఉండరు. ఆమె తన మాటలతో ఎంతటి వారినైనా మెస్మరైజ్ చేస్తుంది. అలాంటి యాంకర్ సుమ నటించిన జయమ్మ పంచాయతీ వెన్నెల క్రియేషన్స్ పతాకంపై విజయ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ మే ఆరవ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Video Advertisement

దీంతో యాంకర్ సుమ ప్రమోషన్స్ లో భాగంగా చాలా బిజీ అయిపోయింది. తాజాగా ఆమె ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను బయట పెట్టింది అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..! సుమ తన చేతి పై ఉన్న పచ్చబొట్టు గురించి సీక్రెట్ ను బయటపెట్టేసింది. తన చేతిపై వెంకన్న అనే పచ్చబొట్టు వేయించుకున్నాను అని. ఆ పేరు వెనుక ఉన్నటువంటి సీక్రెట్ ఏంటని అడిగితే..

సినిమా చూస్తేనే తెలుస్తుంది అని ఆమె చెప్పారు. మూవీ సెకండాఫ్ లో పేరు ఎందుకు వేయించుకున్నాను అనేది అందరికీ తెలుస్తుంది అని యాంకరమ్మ చెప్పుకొచ్చారు. రాజీవ్ కనకాలతో సినిమా చేస్తాడా అని అడిగితే చేసే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని, దానికోసం మంచి కథ కావాలని చెప్పుకొచ్చారు సుమా.

watch video: