“F3” సినిమాలో తన పాటని వాడుకోవడంపై సుమన్ ఏమన్నారో తెలుసా?

“F3” సినిమాలో తన పాటని వాడుకోవడంపై సుమన్ ఏమన్నారో తెలుసా?

by Anudeep

Ads

ఎఫ్ 2 సినిమాకి సీక్వెల్ వస్తుంది అని ప్రకటించిన తర్వాత చాలామంది అది ఎలా ఉండబోతోంది అని ఎదురు చూశారు. ఎఫ్ 2 సీక్వెల్ అయిన ఎఫ్ 3 కూడా విడుదల అయ్యింది. ఇది మొదటి భాగానికి కొనసాగింపు కాదు. వేరే స్టోరీతో సినిమా నడుస్తుంది. అయితే ఈ రెండు సినిమాలకీ సోషల్ మీడియాలో చాలా ట్రోలింగ్ జరిగింది.

Video Advertisement

అందులోనూ ఈ సినిమాలో ఉన్న కామెడీ గురించి చాలా మంది కామెంట్ చేశారు. కానీ ఇంటర్ నెగటివ్ కామెంట్స్ మధ్యలో కూడా ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు కూడా అదే విధంగా ఈ సినిమా కూడా హిట్ టాక్ తెచ్చుకుంది.

suman

ఇది ఇలా ఉండగా.. ఈ సినిమాలో ఓ పాట సూపర్ హిట్ అయింది కూడా. అది ఒకప్పటి హీరో సుమన్ నటించిన సినిమాలోది. సుమన్ కూడా ఒకప్పుడు స్టార్ హీరోగా కొనసాగిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని వివాదాల కారణంగా ఆయన కెరీర్లో నిలదొక్కుకోలేకపోయారు. తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ ఇచ్చి కొన్ని కీలక పాత్రలలో నటిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే.

తాజాగా.. సుమన్ ఒకప్పుడు నటించిన ” చిన్న అల్లుడు” సినిమాలోని కుర్రాడు బాబోయ్ పాటను “ఎఫ్ 3” సినిమాలో ఉపయోగించడంపై సుమన్ స్పందించారు. ఎఫ్ 3 మూవీలో తన సినిమాలోని పాటను వాడుకోవడంపై హర్షం వ్యక్తం చేసారు. తనకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అప్పట్లో హిట్ అయిన ఆ పాటని వెంకటేష్ ఎంపిక చేసుకోవడంపై తనకు సంతోషంగా ఉందన్నారు. ఈ సినిమాను ఇంకా థియేటర్లో చూడలేదని.. ఎఫ్ 3 మూవీలో తన పాట ఉందని చెప్పడంతో ఫస్ట్ షాక్ అయ్యానని.. తరువాత ఆనందంగా అనిపించిందని చెప్పుకొచ్చారు.


End of Article

You may also like