Ads
ప్రముఖ నిర్మాత ఎం ఎస్ రాజు తనయుడు, టాలీవుడ్ హీరో సుమంత్ అశ్విన్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. సుమంత్ అశ్విన్ “తూనీగ తూనీగ” సినిమా తో తెలుగు తెర కు పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విఫలం అయినా.. ఆ తరువాత వచ్చిన “అంతకుముందు ఆ తరువాత ” సినిమా మంచి పేరు తెచ్చుకుంది. ఈ సినిమా కి ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహించాడు. ఆ తరువాత సుమంత్ అశ్విన్ లవర్స్, చక్కిలిగింత, కేరింత, కొలంబస్, రైట్ రైట్, ఫ్యాషన్ డిజైనర్, హ్యాపీ వెడ్డింగ్, ప్రేమ కథా చిత్రం 2 సినిమాలలో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాడు.
Video Advertisement
తాజాగా సుమంత్ అశ్విన్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. వారి బంధువుల అమ్మాయి అయిన దీపికను సుమంత్ అశ్విన్ ఇరు కుటుంబాల పెద్దల సమక్షం లో పెళ్లి చేసుకోనున్నాడు. హైదరాబాద్ నగర శివార్లలోనే వీరిద్దరి వివాహం జరగనుంది. ఈ నెల 13న సుమంత్ అశ్విన్ వివాహం జరగనుంది. పెళ్లి కూతురు పేరు దీపిక అని తెలుస్తోంది. ఆమె డల్లాస్ లో ఎం ఎస్ చేసారు. ఇరు పక్షాల పెద్దల సమక్షం లోనే వీరి వివాహం జరగనుంది.
End of Article