Mem Famous Review : “సుమంత్ ప్రభాస్” హీరోగా నటించిన మేమ్ ఫేమస్ ఆకట్టుకుందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

Mem Famous Review : “సుమంత్ ప్రభాస్” హీరోగా నటించిన మేమ్ ఫేమస్ ఆకట్టుకుందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by kavitha

Ads

ఇటీవల ప్ర‌మోష‌న్స్‌తో ఆడియెన్స్ లో ఎక్కువ ఆస‌క్తిని కలిగించిన చిన్న చిత్రాలలో మేమ్ ఫేమ‌స్ ఒక‌టి.టిక్ టాక్ తో పాపులర్ అయిన సుమంత్ ప్ర‌భాస్ నటించడమే కాకుండా ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ చిత్రం నేడు థియేటర్లలో విడుదల అయ్యింది. తెలంగాణ నేపథ్యంలో పూర్తిగా కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెరకెక్కిన మేమ్ ఫేమ‌స్‌ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

 • చిత్రం : మేమ్ ఫేమ‌స్
 • నటీనటులు : సుమంత్ ప్రభాస్,మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాసి, నరేంద్ర రవి, మురళీధర్ గౌడ్, కిరణ్ మచ్చ, అంజిమామ, శివ నందన్
 • నిర్మాత : అనురాగ్ రెడ్డి,శరత్ చంద్ర, చంద్రు మనోహర్
 • దర్శకత్వం : సుమంత్ ప్రభాస్
 • సంగీతం : కళ్యాణ్ నాయక్
 • విడుదల తేదీ : మే 26, 2023

స్టోరీ :

బండనర్సంపల్లి అనే గ్రామంలో జులాయిగే తిరిగే ముగ్గురు కుర్రాళ్ళు మహేష్ (సుమంత్ ప్రభాస్), దుర్గ (మణి ఏగుర్ల), బాలకృష్ణ (మౌర్య). పొద్దస్తమానం ఊర్లో లేదా చుట్టుపక్కల ఊర్లలో లేనిపోని గొడవలు పెట్టుకొని వాళ్ళ ముక్కులు పగలకొట్టడం వారి దినచర్య. దీంతో ఊరివాళ్ళు, కుటుంబ‌స‌భ్యులు కూడా ఈ ముగ్గురిని ద్వేషిస్తుంటారు.
కొన్ని ప‌రిస్థితుల వల్ల ఊళ్లోనే గౌర‌వంగా జీవించాలని నిర్ణయించుకున్న ముగ్గురు టెంట్‌హౌజ్ పెడ‌తారు. అయితే టెంట్‌హౌజ్ అగ్నిప్ర‌మాదంలో కాలిపోతుంది. దాంతో అప్పులు పాలవుతారు. వారు ఎలా అప్పు తీర్చారు. వాళ్ళు అనుకున్నట్లుగా ఊళ్ళో గౌరవంగా బ్రతికరా? అనేదే కథ.

రివ్యూ :

ఇంతకుముందు షార్ట్ ఫిలిమ్స్ చేసిన సుమంత్ ప్రభాస్ నటుడిగా తొలి చిత్రం అనే భావన రాకుండా మంచి ఈజ్ తో నటించాడు. సుమంత్ ప్రభాస్ ఫ్రెండ్స్ పాత్రల్లో మౌర్య, మణి తమ నటనతో ఆకట్టుకున్నారు. మౌనిక పాత్రలో పల్లెటూరు యువతిగా సార్య సహజంగా నటించింది.
సిరి రాశి తమ పాత్రలో పర్వాలేదనిపించుకుంది.శివ నందన్ లిప్స్టిక్ స్పాయిలర్ లింగంగా మూవీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అంజిమామ, మురళీధర్ గౌడ్ మూవీకి ప్రధాన ఎస్సెట్స్. వారి క్యారెక్టర్ల ద్వారా పండిన కామెడీని  ఆడియెన్స్ బాగా ఆస్వాదిస్తున్నారు.
పాత్రలు  మరియు కథ విషయంలో ఎక్కువ డెప్త్ లేకుండా చాలా సింపుల్ గా స్టోరి -కథనాన్ని రాసుకున్న తీరు బాగుంది. ఒకడు ఎదగాలి అని అనుకున్నప్పుడు చుట్టూ ఉండేవారు ఎలా సాయం చేస్తారనే విషయాన్ని పాజిటివ్ గా చూపించిన తీరు బాగుంది. సినిమాటోగ్రాఫర్ శ్యామ్ దూపాటి తక్కువ బడ్జెట్ సినిమా అయినా  అద్భుతంగా తెరకెక్కించాడు. ఫ్రేమింగ్స్ విషయంలో మరింత జాగ్రత్తపడితే ఇంకా బాగుండేది.
ఈ చిత్రానికి కళ్యాణ్ నాయక్ సమకూర్చిన సాంగ్స్, నేపధ్య సంగీతం సరిగా పని చేయలేదు. పాటలతో పోలిస్తే  బ్యాక్ గ్రౌండ్  మ్యూజిక్ మూవీని ఎలివేట్ చేయడంలో విఫలమైందనే చెప్పవచ్చు. ఒక గ్రామంలో చాలా సింపుల్ గా మూవీ మొత్తాన్ని తీశారు. దాంతో సహజత్వం ఎక్కడా మిస్ అవ్వలేదు.

ప్లస్ పాయింట్స్ :

 • నటీనటుల పర్ఫార్మెన్స్
 • నిర్మాణ విలువలు
 • సినిమాటోగ్రాఫి

మైనస్ పాయింట్స్:

 • ఒకే పాయింట్ చుట్టూ తిరిగే క‌థ
 • స్ట్రాంగ్ ఎమోష‌న్ లేకపోవడం
 • బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

రేటింగ్ :

2.5/5

ట్యాగ్ లైన్ :

లాజిక్స్‌, స్టోరీ గురించి ఆలోచించ‌కుండా చూస్తే టైమ్‌పాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌…

watch trailer:


End of Article

You may also like