Michael Review : “సందీప్ కిషన్” ఈ సినిమాతో హిట్ కొట్టారా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

Michael Review : “సందీప్ కిషన్” ఈ సినిమాతో హిట్ కొట్టారా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Mohana Priya
  • చిత్రం : మైఖేల్
  • నటీనటులు : సందీప్ కిషన్, విజయ్ సేతుపతి, దివ్యాంశ కౌశిక్.
  • నిర్మాత : భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు
  • దర్శకత్వం : రంజిత్ జయకోడి
  • సంగీతం : సామ్ CS
  • విడుదల తేదీ : ఫిబ్రవరి 3, 2023

Michael movie review

Video Advertisement

స్టోరీ: 

మైఖేల్ (సందీప్ కిషన్) చిన్నప్పటి నుంచి కూడా ఒక పెద్ద గ్యాంగ్ స్టర్ అవ్వాలి అని అనుకుంటాడు. తర్వాత గురు (గౌతమ్ మీనన్) అనే ఒక వ్యక్తి దగ్గర చేరుతాడు. ఒకరి మీద పగ తీర్చుకోవడానికి మైఖేల్ ఢిల్లీకి వెళ్తాడు. అక్కడ మైఖేల్ కి తీర (దివ్యాంశ కౌశిక్) అనే అమ్మాయి పరిచయం అవుతుంది. తర్వాత వారిద్దరూ ప్రేమించుకుంటారు. అప్పుడు మైఖేల్ కి ఎదురైన సమస్యలు ఏంటి? అసలు తీర ఎలాంటి అమ్మాయి? మైఖేల్ తర్వాత ఎలాంటి సంఘటనలు ఎదుర్కొన్నాడు? తాను అనుకున్నది సాధించాడా? అతని కథ ఏంటి? ఇవన్నీ తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే.

michael censor talk

రివ్యూ :

ఇప్పుడు ఉన్న యంగ్ హీరోల్లో ప్రతి సినిమాకి కథ పరంగా ఎంతో జాగ్రత్తలు తీసుకుంటూ, సినిమా సినిమాకి కొత్తదనం ఉండేలా చూసుకుంటున్న హీరో సందీప్ కిషన్. కమర్షియల్ సినిమాలతో పాటు కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలని కూడా సందీప్ కిషన్ చేస్తూ ఉంటారు. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా కానీ ప్రతి సినిమాకి సందీప్ కిషన్ కి మాత్రం నటుడిగా చాలా మంచి మార్కులు పడతాయి. ప్రతి సినిమాకి ఆ సినిమాకి తగ్గట్టు తనని తాను మార్చుకోవడం, అలాగే ఆ పాత్ర తెరపై బాగా కనిపించడానికి ఎంతో కష్టపడడం ప్రేక్షకులు గుర్తించారు.

michael censor talk

ఇప్పుడు ఈ సినిమాకి కూడా అలాగే కష్టపడ్డారు అని తెలుస్తోంది. ఈ సినిమాలో సందీప్ కిషన్ వేర్వేరు వయసు ఉన్న పాత్రలు పోషించారు. ఆ పాత్రకి తగ్గట్టుగా సందీప్ కిషన్ తనని తాను మార్చుకున్నారు కూడా. సినిమా మొత్తంలో సందీప్ కిషన్ కి డైలాగ్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఎక్కువగా ఎక్స్ప్రెషన్స్ తోనే ప్రేక్షకులకి తాను అనుకున్నది చెప్పాల్సి ఉంటుంది. ఇలాంటి పాత్ర ఎంచుకోవడం కూడా చిన్న విషయం కాదు. కానీ సందీప్ కిషన్ ని చూస్తే ఆ పాత్రకి పూర్తిగా న్యాయం చేశారు ఏమో అనిపిస్తుంది.

ఇటీవల కాలంలో ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా సినిమాలు చాలా ఎక్కువ అయ్యాయి. ఈ సినిమా కూడా అలాంటి సినిమానే. సినిమా మొత్తం ఒక యాక్షన్ డ్రామా టోన్ ఎలా అయితే ఉంటుందో అదే టోన్ లో సాగుతుంది. ఇందులో చాలా మంది ప్రముఖ నటీనటులు ఉన్నారు. కానీ వారిలో గౌతమ్ మీనన్, విజయ్ సేతుపతి వరలక్ష్మి శరత్ కుమార్ పాత్రలు వారు న్యాయం చేశారు అని అనిపిస్తాయి. హీరోయిన్  కౌశిక్ కూడా తన పాత్ర పరిధి మేరకు బానే చేశారు అనిపిస్తుంది.

michael censor talk

పాటలు కూడా సినిమాలో ఒక ఫ్లోలో వెళ్ళిపోతాయి. అంతా బాగానే నడుస్తూ ఉంటుంది కానీ ఎక్కడా ఒక హై మూమెంట్ ఇలాంటివి అనిపించవు. సినిమాలో మంచి యాక్షన్ సీన్స్ ఉన్నాయి. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. అయినా కూడా ఇంకా ఏదైనా ఒక మంచి ఎలివేషన్ లాంటిది ఉంటే బాగుండు ఏమో అని సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకుడికి అనిపిస్తూ ఉంటుంది. స్క్రీన్ ప్లే, కొన్ని సీన్స్ ఎడిటింగ్ విషయంలో ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకుంటే బాగుండేదేమో అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్: 

  • సందీప్ కిషన్
  • యాక్షన్ సీన్స్
  • సినిమాటోగ్రఫీ
  • మ్యూజిక్

మైనస్ పాయింట్స్ :

  • అవసరం లేని కొన్ని పాత్రలు
  • అక్కడక్కడ సాగదీసినట్టుగా ఉండే కొన్ని సీన్స్

రేటింగ్ : 

3/5

ట్యాగ్ లైన్ :

కథ కొత్తది కాకపోయినా కూడా సినిమా బృందం చేసిన ప్రయత్నం మాత్రం చాలా కొత్తగా ఉంది. ఇలాంటి సినిమాలు మనం డబ్బింగ్ సినిమాలుగా చూస్తాములే కానీ తెలుగులో రావడం అనేది చాలా తక్కువగానే జరుగుతూ ఉంటుంది. కొంతకాలం క్రితం వచ్చిన కేజిఎఫ్ కూడా ఇలాంటి ఒక యాక్షన్ సినిమా. ఒక మంచి యాక్షన్ లవ్ స్టోరీ చూడాలి అనుకునే వారికి మైఖేల్ ఒక్కసారి చూడగలిగే సినిమాగా నిలుస్తుంది.

watch trailer :


You may also like

Leave a Comment