ఈ అమ్మాయిలో ఆ లక్షణాలు లేవు… సీతాదేవి అందంగా ఉండాలి..! సాయి పల్లవి మీద బాలీవుడ్ నటుడి కామెంట్స్..!

ఈ అమ్మాయిలో ఆ లక్షణాలు లేవు… సీతాదేవి అందంగా ఉండాలి..! సాయి పల్లవి మీద బాలీవుడ్ నటుడి కామెంట్స్..!

by Mohana Priya

Ads

సినిమాల్లో హీరోయిన్స్ అంటే ఒకలాగా ఉండాలి అనే ఒక అపోహ ఉంది. ఆ అపోహని తొలగించడానికి చాలా మంది నటులు వచ్చారు. అప్పట్లో చాలా మంది వచ్చారు. ఇప్పుడు కూడా చాలా మంది హీరోయిన్స్ వస్తున్నారు. వారిలో మొదటిగా చెప్పుకోవాల్సింది సాయి పల్లవి గురించి. సాయి పల్లవి మేకప్ ఎక్కువగా వేసుకోరు. చాలా సినిమాల్లో మేకప్ తక్కువగానే ఉంటుంది. సినిమాల్లో కేవలం తన నటనని మాత్రమే చూడాలి అనే ఉద్దేశంతో సాయి పల్లవి ఇలా చేస్తూ ఉంటారు. సాయి పల్లవి ప్రయత్నం సఫలించింది కూడా. చాలా మంది సాయి పల్లవి లోని గొప్ప నటిని చూశారు. అందుకే సాయి పల్లవికి వరుసగా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు సాయి పల్లవి హిందీలో రామాయణంలో నటిస్తున్నారు.

Video Advertisement

sunil lahri about sai pallavi

రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తున్నారు. సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. ఈ విషయం విని అందరూ ఆనందపడ్డారు. సాయి పల్లవి ఇలాంటి ఒక పెద్ద ప్రాజెక్ట్ లో నటించడం అనేది చాలా మంచి విషయం అని అన్నారు. దాంతో సాయి పల్లవి ఎంత గొప్ప నటి అనేది బాలీవుడ్ వాళ్లకు కూడా తెలుస్తుంది అని అన్నారు. అయితే, ఇప్పుడు హిందీలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న రామాయణం సీరియల్ లో లక్ష్మణుడిగా నటించిన సునీల్ లాహ్రీ, సాయి పల్లవి మీద చేసిన కామెంట్స్ చర్చలకి దారి తీస్తున్నాయి. ఈ విషయం మీద సునీల్ మాట్లాడుతూ, “ఆ అమ్మాయి ఎలా నటిస్తుందో నాకు తెలియదు.”

“నేను తన సినిమాలని చూడలేదు. కానీ లుక్స్ పరంగా మాట్లాడితే నాకు అంత కన్విన్సింగ్ గా అనిపించలేదు. నా మెదడులో సీత చాలా అందంగా ఉంటుంది. ఆమె ముఖము చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. సాయి పల్లవిలో ఆ పర్ఫెక్షన్ అనే లక్షణం ఉంది అని నేను అనుకోవట్లేదు. భారతదేశ ప్రజల మైండ్ సెట్ ప్రకారం చెప్పాలి అంటే ప్రపంచంలో ఉన్న దేవతలు అందరూ కూడా ఎంతో అసాధారణంగా ఉండాలి. రావణుడు ప్రేమలో పడే అంత ఆకర్షణీయంగా ఈ నటిని ఎలా చేస్తారో నాకు తెలియదు” అని అన్నారు. ఈ విషయం మీద కామెంట్స్ వస్తున్నాయి. సాయి పల్లవి ఎంతో మంచి నటి. అలాంటి నటి గురించి ఇలా మాట్లాడటం ఏంటి అని అందరూ కామెంట్స్ చేస్తున్నారు.


End of Article

You may also like