Ads
సాధారణంగా సినిమా వాళ్ళంతా తమ ఆహారపు అలవాట్లు విషయంలో చాలా కాన్షస్ గా ఉంటారు. ఎక్కువ,తక్కువలు చూసుకుంటూ తమ బరువుని పెంచకుండా ఉండే ఆహారాలకే ప్రయారిటీ ఇస్తారు. అది మొదటి తరం నటుల నుంచి ఉంది. కాకపోతే కాస్త తక్కువ. అందుకే వాళ్లు సినిమాల నుంచి తప్పుకోగానే లావు అవటం వంటివి జరిగేవి. ఇప్పటిలా ప్రత్యేకమైన డైట్ లు, కోచ్ లు ఉండేవారు కాదు. కానీ కృష్ణ గారు అప్పటి నుంచి ఇప్పటి వరకు తన ఆహారపు అలవాట్లను అలాగే కొనసాగించేవారు. అందుకే ఆయన చాలా హెల్ది గా, ఫిట్ గా ఉండేవారు.
Video Advertisement
నిజం చెప్పాలంటే… కృష్ణ భోజన ప్రియులు కాదు. ఆయన అసలు అన్నం ఎక్కువ తినరు. కూరలు మాత్రం ఇష్టంగా తింటారు” అని విజయ నిర్మల పేర్కొన్నారు. కృష్ణ కథానాయకుడిగా పరిచయమైన ‘తేనె మనసులు’ విడుదలై 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కృష్ణ గురించి ఈ విషయాలు చెప్పుకొచ్చారు.
అలాగే ఆయనతో సుదీర్ఘ కాలం జర్నీ చేసిన రచయిత తోటపల్లి మధు, కృష్ణగారి ఫుడ్ హ్యాబెట్స్ విషయంలో ఇంట్రస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. ” కృష్ణ గారు ఇంటి నుంచి వచ్చేటప్పుడు టిఫిన్ తిని వచ్చేవారు, సెట్ కి వచ్చాక పెరుగు ఆవడ తినేవారు. తర్వాత లంచ్ చేసిన తర్వాత ఒక సున్నుండ, సాయంత్రం వీట్ దోస తినేవారు. ఏమి తిన్న హెల్త్య్ గా, ఫిట్ గా ఉండేవారు.” అని రచయిత తోటపల్లి మధు వెల్లడించారు.
కృష్ణగారు ఎప్పుడు ఇంటి భోజనానికి ప్రాధాన్యత ఇచ్చేవారని ఆయన భార్య విజయ నిర్మల గతం లో తెలిపారు. అమెరికాలో ‘హరే కృష్ణ… హలో రాధా’, రాజస్థాన్ ఎడారిలో ‘కురుక్షేత్రం’ సినిమాలు షూటింగ్స్ జరిగినప్పుడు కృష్ణను తాను స్వయంగా వంట చేసి పెట్టానని విజయ నిర్మల తెలిపారు. గత పదేళ్ళుగా ఆయన ఉదయం పూట ఒకటి లేదా రెండు ఇడ్లీలు, రాగి జావ… మధ్యాహ్నం కొద్దిగా భోజనం… రాత్రి పూట సగం చపాతీ, పళ్ళ రసాలు తీసుకునే వారు అని ఆయన సన్నిహితులు వెల్లడించారు.
End of Article