సూపర్ స్టార్ మహేష్ సినిమా సర్కారు వారి పాట కోసం కొన్ని సంవత్సరాల అభిమానుల ఎదురు చూపు సక్సెస్ అయింది. ఇందులో మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ కథానాయికగా దర్శకుడు పరుశురాం డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ అన్ని అడ్డంకులు దాటుకొని మే 14వ తేదీన థియేటర్ లోకి వచ్చింది. మహేష్ బాబు వరుస హ్యాట్రిక్స్ మూవీస్ తర్వాత వచ్చిన ఈ మూవీపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. థియేటర్ లోకి వచ్చిన మొదటి రోజు మిశ్రమ స్పందన అందుకుంది. ఈ మూవీ టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ లో దూసుకుపోతోంది. మూవీ భారీ విజయాన్ని అందుకోవడంతో తాజా కర్నూలు జిల్లాలో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈవెంట్ లో చిత్ర యూనిట్ మొత్తం పాల్గొన్నారు. భారీ సంఖ్యలో అభిమానులు రావడంతో ఈవెంట్ గ్రాండ్ గా సక్సెస్ అయ్యింది. ఈ సందర్భంగా డైరెక్టర్ పరుశురాం మాట్లాడుతూ కర్నూలు జిల్లాకు నాకు అభినవ సంబంధాలు ఉన్నాయని, ఒక్కడు మూవీ చూసిన తర్వాత నేను దర్శకుణ్ణి అవ్వాలని భావించి ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాను అని నేను ఎంతగానో ఇష్టపడే సూపర్ స్టార్ తో సినిమా చేయడం, ఇక్కడికి రావడం నా లైఫ్ టైం బహుమతి అని అన్నారు.

Video Advertisement

ఈ సందర్భంగా హీరో మహేష్ బాబుకు థాంక్స్ చెబుతున్నాను. ఈ మూవీలో ప్రతి డైలాగ్, ప్రతి సీన్ ఆయన మీద నాకున్న ప్రేమనే. నా శక్తి ఉన్నంత వరకు ఆయనకు అద్భుతమైన హిట్లు ఇస్తానని చెప్పాను. ఆ మాట నిలబెట్టుకున్నానని అనుకుంటున్నాను. సినిమా కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సినిమా బ్లాక్ బాస్టర్ కావడం కోసం కారణమైన మీకు చేతులెత్తి దండం పెడుతున్నా అని దర్శకుడు పరుశురాం ఎమోషనల్ అయ్యారు.