బాలీవుడ్ సినీ నటి స్వర భాస్కర్ మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా చర్చల్లో నిలిచారు. ఇటీవల తాలిబన్ల పై జరుగుతున్న గొడవ గురించి స్వర భాస్కర్ స్పందించారు. ఈ విషయంపై స్వర భాస్కర్ మాట్లాడుతూ, ఈ రకంగా ట్వీట్ చేశారు. “మనం హిందూత్వ లో జరుగుతున్న దారుణాల గురించి మాత్రం మాట్లాడడం లే కానీ తాలిబన్ లో  జరుగుతున్న దారుణం గురించి మాట్లాడుతున్నాం.

తాలిబాన్ లో జరుగుతున్న విషయం గురించి వదిలేసి మన హిందుత్వ లో జరిగే దారుణాలు గురించి మనం ఎందుకు మాట్లాడట్లేదు. మన మానవత్వం విలువలు అవతలవారి గుర్తింపుని బట్టి మారేడట్టు ఉండకూడదు” అని అన్నారు. స్వర భాస్కర్ గొడవల్లో నిలవడం ఇది మొదటిసారి కాదు. అంతకుముందు కూడా ఎన్నో సార్లు, ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా చర్చల్లో నిలిచారు స్వర భాస్కర్.

కంగనా రనౌత్ తో జరిగిన గొడవ కూడా పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. స్వర భాస్కర్ తెలుగు కుటుంబానికి చెందినవారు. కానీ ఎన్నో సంవత్సరాల నుండి ముంబై లో స్థిరపడ్డారు. హిందీలో ఎన్నో సినిమాల్లో నటించి ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ప్రస్తుతం స్వర భాస్కర్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలాగే స్వర భాస్కర్ పై కూడా ఎంతో మంది నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.