Guntur Kaaram Dialogues in Telugu: గుంటూరు కారం సినిమా డైలాగ్స్ !మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న మూడవ సినిమా గుంటూరు కారం. సంక్రాంతికి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. మహేష్ బాబు సరసన శ్రీ లీల, మీనాక్షి చౌదరిలు నటించారు. ఈ సినిమాకి SS థమన్ సంగీతాన్ని సమకూర్చారు. హారిక హాసిని నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించగా. నవీన్ నూలి ఈ చిత్రానికి ఎడిటర్ గా పని చేసారు.
మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన గత చిత్రాల రెస్పాన్స్ ఎలా వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలోని డైలాగ్స్ ఇప్పటికి పాపులర్ గానే ఉన్నాయి. సుమారు 14 సంవత్సరాల తరువాత ఇద్దరి కలియికలో సినిమా వస్తుండగా ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.
త్రివిక్రమ్ సినిమాలో డైలాగ్స్ ఎంత పాపులర్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాగే ఈ సినిమాకి కూడా గురూజీ మాస్ అండ్ పవర్ఫుల్ డైలాగ్స్ ఇచ్చే ఉంటారని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
ఇక గుంటూరు కారం లో శ్రీలీలా, మీనాక్షి చౌదరి, జగపతి బాబు, రమ్య కృష్ణ, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం మొదలగు వారు ప్రధాన పాత్రలని పోషించారు.