ఎట్టకేలకు ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 మొదలయ్యింది. సాధారణంగా అయితే ఈ ప్రోగ్రాంలో సినీ రంగానికి చెందిన సెలబ్రిటీలని మాత్రమే ఎక్కువగా తీసుకుంటారు. కానీ ఈసారి మాత్రం సినిమా రంగానికి చెందిన ప్రముఖులతోపాటు సోషల్ మీడియాకు చెందిన ప్రముఖులను కూడా తీసుకున్నారు. అంతే కాకుండా సీరియల్ నటులు కూడా ఇందులో కంటెస్టెంట్స్ గా పాల్గొంటున్నారు. మనకి నచ్చిన సెలెబ్రిటీ నిజ జీవితంలో ఎలా ఉంటారో తెలుసుకోవాలనే ఆసక్తి మనలో చాలా మందికి ఉంటుంది.మొదటి వారంలో సరయూ.. రెండవ వారంలో ఉమాదేవి.. మూడోవారంలో లహరి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.
ఈ వారం ఏకంగా ఎనిమిదిమంది కంటెస్టెంట్లు ఎలిమినేషన్ కోసం నామినేట్ అయ్యారు.ఈ వారం ఎలిమినేషన్లో సన్నీ, కాజల్, లోబో, యానీ మాస్టర్, సిరి, నటరాజ్ మాస్టర్, ప్రియ ఉన్నారు.కొన్ని వెబ్‌సైట్స్ నిర్వహించిన పోల్స్‌లో నటరాజ్ మాస్టర్ తక్కువ శాతం ఓట్లు రావడంతో అంతా నటరాజ్ మాస్టర్ ఇంటి నుంచి వెళ్లనున్నట్లుగా టాక్ నడిచింది. ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యేంతవరకు ఆగాల్సిందే.