ఎట్టకేలకు ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 మొదలయ్యింది. సాధారణంగా అయితే ఈ ప్రోగ్రాంలో సినీ రంగానికి చెందిన సెలబ్రిటీలని మాత్రమే ఎక్కువగా తీసుకుంటారు. కానీ ఈసారి మాత్రం సినిమా రంగానికి చెందిన ప్రముఖులతోపాటు సోషల్ మీడియాకు చెందిన ప్రముఖులను కూడా తీసుకున్నారు. అంతే కాకుండా సీరియల్ నటులు కూడా ఇందులో కంటెస్టెంట్స్ గా పాల్గొంటున్నారు. మనకి నచ్చిన సెలెబ్రిటీ నిజ జీవితంలో ఎలా ఉంటారో తెలుసుకోవాలనే ఆసక్తి మనలో చాలా మందికి ఉంటుంది.

Video Advertisement

Bigg Boss Telugu Voting

Bigg Boss Telugu Voting

రెండు ఎలిమినేషన్స్ ప్రక్రియలో  సరయు, ఉమాదేవి ఎలిమినేట్ అయ్యారు.ఈ వారం ప్రియాంక, శ్రీరామ్, మానస్, లహరి, ప్రియ నామినేట్ కాగా.. వీరి లో ప్రియాంక, శ్రీరామ్, మానస్ సేఫ్ జోన్‏లో ఉన్నట్లుగా తెలుస్తోంది. లహరి మరియు ప్రియా ఇద్దరు డేంజర్ జోన్ లో ఉన్నారు అని తెలుస్తుంది. ఈవారం ఎలిమినేట్ అయ్యేది మాత్రం లహరినే అంటూ సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది .ఆన్లైన్ ఓటింగ్  పరంగా అందరి కంటే తక్కువ ఓట్లు లహరికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యేంతవరకు ఆగాల్సిందే.