2023 ప్రపంచ కప్పులో టీమిండియా తమ జోరు కొనసాగిస్తుంది. టీం సమిష్ఠ ప్రదర్శనతో విజయాల పరంపరన నమోదు చేసుకుంది. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్ల లోనూ విజయాలు సాధించి టేబుల్ లో టాప్ ప్లేస్ లో నిలబడింది. ఆదివారం ధర్మశాలలో న్యూజిలాండ్ పై జరిగిన మ్యాచ్ లో ఘనవిజయాన్ని నమోదు చేసుకుంది.20 ఏళ్ల తర్వాత ప్రపంచ కప్ లో న్యూజిలాండ్ ను ఓడించి చరిత్రను తిరగరాసింది. 20 ఏళ్ల నుండి న్యూజిలాండ్ చేతిలో ప్రపంచ కప్ సిరీస్ లో భారత్ ఓడిపోతూనే ఉంది. న్యూజిలాండ్ ను ఓడించాలి అనేది భారత్ టీం తో పాటు యావత్తు భారత అభిమానులకు చిరకాల కల. అది ఆదివారం నెరవేరింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ టీం ఒక దశలో చాలా బాగా బ్యాటింగ్ చేసింది. భారత్ బౌలర్లకు వికెట్లు తీయడం కష్టంగా మారింది. కానీ భారత్ బౌలర్లు తమ బౌలింగ్ తీరును మార్చుకుని వికెట్లు పడగొట్టడం మొదలుపెట్టారు.
స్టార్ బౌలర్ షమి అయితే ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎన్నికయ్యాడు. బ్యాటింగ్ లో విరాట్ కోహ్లీ తన విశ్వరూపం చూపించగా, జడేజా కోహ్లీకి సహకారం అందించి భారత్ ను విజయతీరాలకు చేర్చారు.దాంతో ఈ ప్రపంచ కప్ లో ఓటమి ఎరగనీ జట్టుగా నిలిచింది. న్యూజిలాండ్ టీమిండియా తో ఓటమి తర్వాత రెండో స్థానానికి పడిపోయింది.భారత జట్టు అధికారికంగా టేబుల్ లో మొదటి స్థానంలో ఉన్న కూడా ఇంకా సెమిస్ కి ప్రవేశించలేదు.
సెమీఫైనల్ కు అర్హత సాధించాలంటే ఒక జట్టు కనీసం ఆరు విజయాలు సాధించాలి. రోహిత్ సేన ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్ లోనూ విజయం సాధించింది కాబట్టి మరో మ్యాచ్ గెలిస్తే సెమీఫైనల్ బెర్త్ దక్కుతుంది. టీమిండియా కు ఇంకా నాలుగు మ్యాచ్ లు మిగిలి ఉన్నాయి. వీటిలో ఒక్కటి గెలిచిన సరిపోతుంది.భారత్ కు సెమీస్ చేరడం పెద్ద కష్టమేమీ కాదు. దాదాపు భారత్, న్యూజిలాండ్ సెమీస్ కి అర్హత సాధించడం ఖాయమే. వీరితోపాటు మిగతా రెండు జట్లు ఏవి సెమీఫైనల్ కి చేరతాయి అనేది వేచి చూడాలి. Also Read:కొంప ముంచావు కాదయ్యా కేన్ మామా ! ఏమో అనుకున్నాం ఇలా చేసావు ఏంటి !
2023
Shani Effect: 2023 జనవరి నెలలో శని సంచారం కీలక మార్పు జరగబోతుంది. శని మకర రాశి నుండి కుంభరాశిలోకి ప్రవేశిస్తుంది. శని సంచార అన్ని రాశులపైనా ప్రభావం చూపిస్తుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఊహించని అదృష్టం వచ్చి, వారు పట్టిందల్లా బంగారం అవుతుందంట.
2023లో కుంభరాశిలో శని సంచారం చేయడం వల్ల ఈ రాశుల వారికి చాలా ప్రయోజనాలు జరుగుతాయి. శనీశ్వరుడి అనుగ్రహం ఈ రాశివారి పై కురుస్తుంది. నూతన సంవత్సరం 2023కి కొన్ని రోజుల్లో స్వాగతం చెప్పబోతున్నాం. 2023 లో జనవరి 17న శనీశ్వరుడు మకరరాశి నుండి తన సొంత రాశి అయిన కుంభ రాశిలోకి వెళ్తాడు. ఇక జరగబోయే ఈ మార్పు పంచాంగంలో చాలా ముఖ్యమైనదిగా చెప్తారు. ఎందుకంటే శనీ ప్రతి మనవుడుకి అతను చేసుకున్న కర్మలను బట్టి వారికి ఫలితాలను ఇస్తాడు.ఇక ఏలిన నాటి శని ప్రభావం ఎవరి జాతకంలో ఉంటుందో, వాళ్ళు చాలా కష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది. కానీ శనీశ్వరుడి అనుగ్రహం ఉన్న వాళ్ళకు అన్ని కలిసి వస్తాయి. కుంభరాశిలో శని సంచారం చేయడం వల్ల కొన్ని రాశుల వారికి మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. శనీశ్వరుడు అనుగ్రహంతో సంవత్సరం పొడవునా వారు చేసే పనులకు ఆటంకాలు ఉండవు. వారు పట్టుకున్నవన్ని బంగారమే అని చెప్తున్నారు. 2023లో కుంభరాశిలో శనిప్రవేశంతో తులారాశి, మిథునరాశి పై శని ప్రభావం పోతుంది. అంతేకాకుండా ధనుస్సు రాశి వారు ఏలిన నాటి శని నుండి విముక్తి పొందుతారు. ఇక 2023లో ఏ రాశుల పై శనీశ్వరుడి అనుగ్రహం ఉంటుందో చూద్దాం..
మిథున రాశి: 2023లో శని సంచారం ఈ రాశి వారికి అనుకూలంగా ఉండబోతుంది. రాబోయే సంవత్సరంలో వీరు అదృష్టవంతులు అవడమే కాకుండా, ఈ రాశివారికి అదృష్టం కలిసి వస్తుంది.ఆగిన పనులన్నీ ఈ ఏడాది పూర్తవుతాయి. నూతన ఆదాయ మార్గాలు కలుగుతాయి. వీరు ఏ పనులు మొదలుపెట్టిన కూడా ఆర్ధిక ప్రయోజనాలు ఇస్తాయి.
తుల రాశి: తుల రాశికి శుక్రుడు అధిపతి. అంతేకాకుండా శనీశ్వరుడు ఈ రాశికి అధిక రాశి. శుక్ర,శని గ్రహాల స్నేహ భావన వల్ల ఈ రాశి వారిపై శని మంచి ప్రభావాన్ని చూపిస్తాడు. ఇక ఈ రాశి వారు చేపట్టిన పనులన్నీ కూడా పూర్తవుతాయి.
ధనుస్సు రాశి: 2023లో ఈ రాశి వారికి ఏలిన నాటి శని ప్రభావం నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది. ఈ రాశికి అధిపతి బృహస్పతి.అయితే జ్యోతిషశాస్త్రంలో శని, బృహస్పతి కలవడాన్ని సమాన సంబంధం అని అంటారు. అంటే ఈ రెంటింటి మధ్య శత్రుత్వం లేదు. అలాంటప్పుడు శని అనుగ్రహం ఉంటుంది. ఈ రాశివారు ఉద్యోగంలో ప్రమోషన్, ధనలాభాలను పొందుతారు.అలాగే సమాజంలో కీర్తి ప్రతిష్టలు,గౌరవం లభిస్తాయి.