Shani Effect: కొత్త ఏడాదిలో ఈ మూడు రాశులవారు పట్టిందల్లా బంగారమే..

Shani Effect: కొత్త ఏడాదిలో ఈ మూడు రాశులవారు పట్టిందల్లా బంగారమే..

by kavitha

Shani Effect: 2023 జనవరి నెలలో శని సంచారం కీలక మార్పు జరగబోతుంది. శని మకర రాశి నుండి కుంభరాశిలోకి ప్రవేశిస్తుంది. శని సంచార అన్ని రాశులపైనా ప్రభావం చూపిస్తుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఊహించని అదృష్టం వచ్చి, వారు పట్టిందల్లా బంగారం అవుతుందంట.

Video Advertisement

2023లో కుంభరాశిలో శని సంచారం చేయడం వల్ల ఈ రాశుల వారికి చాలా ప్రయోజనాలు జరుగుతాయి. శనీశ్వరుడి అనుగ్రహం ఈ రాశివారి పై కురుస్తుంది. నూతన సంవత్సరం 2023కి కొన్ని రోజుల్లో స్వాగతం చెప్పబోతున్నాం.  2023 లో జనవరి 17న శనీశ్వరుడు మకరరాశి నుండి తన సొంత రాశి అయిన కుంభ రాశిలోకి వెళ్తాడు. ఇక జరగబోయే ఈ మార్పు పంచాంగంలో చాలా ముఖ్యమైనదిగా చెప్తారు. ఎందుకంటే శనీ ప్రతి మనవుడుకి అతను చేసుకున్న కర్మలను బట్టి వారికి ఫలితాలను ఇస్తాడు.ఇక ఏలిన నాటి శని ప్రభావం ఎవరి జాతకంలో ఉంటుందో, వాళ్ళు చాలా కష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది. కానీ శనీశ్వరుడి అనుగ్రహం ఉన్న వాళ్ళకు అన్ని కలిసి వస్తాయి. కుంభరాశిలో శని సంచారం చేయడం వల్ల కొన్ని రాశుల వారికి మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. శనీశ్వరుడు అనుగ్రహంతో సంవత్సరం పొడవునా వారు చేసే పనులకు ఆటంకాలు ఉండవు. వారు పట్టుకున్నవన్ని బంగారమే అని చెప్తున్నారు. 2023లో కుంభరాశిలో శనిప్రవేశంతో తులారాశి, మిథునరాశి పై శని ప్రభావం పోతుంది. అంతేకాకుండా ధనుస్సు రాశి వారు ఏలిన నాటి శని నుండి విముక్తి పొందుతారు. ఇక 2023లో ఏ రాశుల పై శనీశ్వరుడి అనుగ్రహం ఉంటుందో చూద్దాం.. మిథున రాశి: 2023లో శని సంచారం ఈ రాశి వారికి అనుకూలంగా ఉండబోతుంది. రాబోయే సంవత్సరంలో వీరు అదృష్టవంతులు అవడమే కాకుండా, ఈ రాశివారికి అదృష్టం కలిసి వస్తుంది.ఆగిన పనులన్నీ ఈ ఏడాది పూర్తవుతాయి. నూతన ఆదాయ మార్గాలు కలుగుతాయి. వీరు ఏ పనులు మొదలుపెట్టిన కూడా ఆర్ధిక ప్రయోజనాలు ఇస్తాయి.

తుల రాశి: తుల రాశికి శుక్రుడు అధిపతి. అంతేకాకుండా శనీశ్వరుడు ఈ రాశికి అధిక రాశి. శుక్ర,శని గ్రహాల స్నేహ భావన వల్ల ఈ రాశి వారిపై శని మంచి ప్రభావాన్ని చూపిస్తాడు. ఇక ఈ రాశి వారు చేపట్టిన పనులన్నీ కూడా పూర్తవుతాయి.

ధనుస్సు రాశి: 2023లో ఈ రాశి వారికి ఏలిన నాటి శని ప్రభావం నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది. ఈ రాశికి అధిపతి బృహస్పతి.అయితే జ్యోతిషశాస్త్రంలో శని, బృహస్పతి కలవడాన్ని సమాన సంబంధం అని అంటారు. అంటే ఈ రెంటింటి మధ్య శత్రుత్వం లేదు. అలాంటప్పుడు శని అనుగ్రహం ఉంటుంది. ఈ రాశివారు ఉద్యోగంలో ప్రమోషన్, ధనలాభాలను పొందుతారు.అలాగే సమాజంలో కీర్తి ప్రతిష్టలు,గౌరవం లభిస్తాయి.

 


You may also like

Leave a Comment