భారత స్టార్ ఓపెనర్ బ్యాట్స్ మెన్ శిఖర్ ధావన్ ఎప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంటాడు. తన విధ్వంసకరమైన బ్యాటింగ్ కి దేశమంతా అతనికి ఫ్యాన్సే…. డ్రెస్సింగ్ రూమ్ లో అతను చేసే వీడియోలు డాన్సింగ్ వీడియోలు ప్రేక్షకులను ఎప్పుడూ అలరిస్తూ ఉంటాయి. సహచర క్రికెటర్లతో కలిసి తన చేసే అల్లరి ఎప్పుడు సందడిగా ఉంటుంది.
అలాంటి శిఖర్ ధావన్ జీవితంలో కూడా కొద్దిపాటి విషాదం చోటుచేసుకుంది. తాజాగా శిఖర్ ధావన్ తన భార్యనుండి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. శిఖర్ ధావన్ ఏషా ముఖర్జీని రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
కొద్దిరోజులు వీళ్ళ బంధం బాగానే సాగింది. ఏమైందో ఏమో గాని తర్వాత వీరి మధ్య విభేదాలు రావడం ఇద్దరు విడిపోవడం జరిగింది. ఈ క్రమంలో శిఖర్ ధావన్ తన కొడుకు జోరావర్ కు పూర్తిగా దూరమయ్యాడు.తన భార్య ఏషా ముఖర్జీ శిఖర్ ధావన్ ని తన కొడుకు జోరావర్ ను కలవకుండా అడ్డుకుంటుంది.
ఈ కారణంగా శిఖర్ ధావన్ మానసిక క్షోభ అనుభవిస్తున్నాడు. కొడుకును కలుసుకునేందుకు ధావన్ కి కోర్టు అనుమతినిచ్చిన కూడా జొరావర్ ను తన కస్టడీకి ఇవ్వడం లేదు. ఈ క్రమంలోనే శిఖర్ ధావన్ మళ్ళీ కోర్టును ఆశ్రయించాడు.ధావన్ తన కొడుకు జోరావర్ ను నిర్దిష్ట వ్యవధిలో కలుసుకునేందుకు కోర్టు అనుమతినిచ్చింది.ఇద్దరూ వీడియో కాల్ మాట్లాడుకునేందుకు అనుమతినిచ్చింది.
ఈ నేపథ్యంలో తాజాగా శిఖర్ ధావన్ తన కొడుకుతో మాట్లాడుతున్న వీడియో కాల్ స్క్రీన్ షాట్ ను తీసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. తీవ్ర భావోద్వేగానికి గురైన శిఖర్ ధావన్ ను చూసి అభిమానులు, నెటిజన్లు కూడా ఎమోషనల్ అయ్యారు.”ఏక్ అజీబ్ సి బేతాభి హై తేరే బిన్, రెహ్ బి లేతే హై ఔర్ రహా భీ నహీ జాత, గుల్జర్ సాహెబ్” అంటూ రాసుకువచ్చాడు. స్క్రీన్ షాట్ లో జోరావర్ హుడితో కనిపించగా శిఖర్ ధావన్ నవ్వుతూ కనిపించాడు.