క్రికెట్ కు పురిటి గడ్డ ఇంగ్లాండ్. అలాంటి ఇంగ్లాండ్ టీంకు ప్రపంచ కప్ లో ఒక చెత్త రికార్డు దక్కింది. వరల్డ్ కప్ చరిత్రలో ఇప్పటివరకు ఏ జట్టు లేని విధంగా అన్ని టెస్టు ప్లేయింగ్ జట్ల (11) చేతుల్లో ఓడిన తొలి జట్టుగా రికార్డుల్లోకి ఎక్కింది.
Video Advertisement
ఒకసారి వెనక్కి వెళ్లి చరిత్ర చూసుకుంటే…
1975 వరల్డ్ కప్ లో మొదటిసారి ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది. తర్వాత 1979 వరల్డ్ కప్ లో వెస్టిండీస్ చేతిలో ఫైనల్ మ్యాచ్లో పరాజయాన్ని మూటగట్టుకుంది. తర్వాత జరిగిన 1983, 87 వరల్డ్ కప్ లో భారత్, న్యూజిలాండ్, పాకిస్తాన్ చేతుల్లో ఓడింది. 1992 వరల్డ్ కప్ లో అయితే ఏకంగా పసికూన జింబాబ్వే చేతిలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది.
1996 వరల్డ్ కప్ లో శ్రీలంక, సౌతాఫ్రికా చేతుల్లో ఓడిన ఇంగ్లీష్ టీంకు 2011 వరల్డ్ కప్ లో అయితే ఊహించని పరాభవం ఎదురైంది. ఏకంగా ఐర్లాండ్ చేతిలో ఓటమిపాలైంది. 2017 లో అయితే నాగినీలు బంగ్లాదేశ్ చేతుల్లో తీవ్ర పరాజయం పొందింది. అదే రికార్డును కొనసాగిస్తూ తాజా వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓటమిపాలై టెస్ట్ ప్లేయింగ్ దేశాల చేతుల్లో ఓటమి ఎదుర్కొన్న తొలి జట్టుగా ఇప్పటివరకు ఎవరికి సాధ్యంకాని రికార్డును సొంతం చేసుకుంది ఇంగ్లాండ్ టీం.
అక్టోబర్ 15 న్యూఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్లో పసికూన ఆఫ్ఘనిస్తాన్… మేటి టీం అయిన ఇంగ్లాండును 69 పరుగులు తేడాతో చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆప్ఘనిస్తాన్ 49.5 ఓవర్లలో 284 పరుగులకు ఆల్ అవుట్ అయింది. చేదనకు దిగిన ఇంగ్లాండ్ టీం 40.3 ఓవర్లలో 215 పరుగులకు కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.
ఒకప్పటి ఇంగ్లాండ్ టీం మీద ఆడాలంటే ఏ జట్టుకైనా చెమటలు పట్టేవి. ఇంగ్లాండ్ బౌలర్లు దాటి తట్టుకోవాలంటే సాధారణ క్రికెటర్ వల్ల అయ్యేది కాదు. ఎందరో బౌలర్ల చేతిలో దెబ్బలు తిని పెవిలియన్ దారి పట్టిన వాళ్ళు ఉన్నారు. అలాంటి ఇంగ్లాండ్ టీం నేడు పసికూన చేతుల్లో కూడా ఓటమి పాలవుతుందంటే ఎంతగా ఆ టీం స్థాయి దిగిజారిందో క్రికెట్ అభిమానులు అర్థం చేసుకోవచ్చు
ALSO READ : ఇక వరల్డ్ కప్ లో అలాంటి మ్యాచ్ లు చూడలేమా.? 2011 వరకు కూడా పాకిస్థాన్ పై మ్యాచుల్లో.?