ఇక వరల్డ్ కప్ లో అలాంటి మ్యాచ్ లు చూడలేమా.? 2011 వరకు కూడా పాకిస్థాన్ పై మ్యాచుల్లో.?

ఇక వరల్డ్ కప్ లో అలాంటి మ్యాచ్ లు చూడలేమా.? 2011 వరకు కూడా పాకిస్థాన్ పై మ్యాచుల్లో.?

by Mounika Singaluri

Ads

భారతదేశంలో క్రికెట్ కి ఉన్న క్రేజు, ఫాలోయింగ్ ఏ ఇతర ఆటలకి లేదు. గల్లి నుండి ఢిల్లీ దాకా వయసుతో సంబంధం లేకుండా అందరూ క్రికెట్ కి ఫ్యాన్స్. క్రికెట్ వస్తుందంటే చాలు టీవీలకి అతుక్కుపోయి మరీ చూస్తూ ఉంటారు. అందులోనూ బద్ధ శత్రువులైన భారత్-పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అయితే ఆ రోజు పనులన్నీ పక్కన పెట్టినట్లే…

Video Advertisement

భారత్-పాకిస్తాన్ మధ్య ఏ టోర్నమెంట్ జరిగిన, ఏ సిరీస్ జరిగిన ఆ మ్యాచ్ కి ఉండే క్రేజే వేరు. చిరకాల ప్రత్యర్థుల మధ్య జరిగే పోరుకి ఇరుదేశాల ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పటివరకు భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ లలో విజయం ఎక్కువ శాతం భారత్ పక్షాన్నే ఉంది.

తాజాగా 2023 ప్రపంచ కప్ లో భారత్-పాకిస్తాన్ మరోసారి తలపడ్డాయి. యధావిధిగా విజయం భారత్ నే వరించింది. అయితే గతంలో భారత్ -పాకిస్తాన్ మ్యాచ్ లలో ఉండే మజా ఇప్పుడు కురువయ్యింది. దాదాపు ఇప్పుడు చాలావరకు మ్యాచ్ లు ఏకపక్షంగా జరుగుతున్నాయి. మొన్న జరిగిన మ్యాచ్ దీనికి ఉదాహరణ. భారత్ ఏకపక్షంగా పాకిస్తాన్ ని ఉతికి ఆరేసింది. అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్కి దాదాపు లక్ష ఇరవై వేల మంది హాజరయ్యారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్ లో అయితే లైవ్ లో మూడు కోట్ల మంది చూసినట్లు ప్రకటించింది. అలాంటిది ఈ మ్యాచ్ కూడా తుస్సు మనిపించింది.

మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 29 ఓవర్లకు 150/2 తో పోటాపోటీగా ఆడింది. అయితే అక్కడనుండి ఒక దశ దాటగా బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం కుప్పకూలిపోయింది. పాక్ ఆటగాళ్లందరూ సింగిల్ డిజిట్ లకే పరిమితమయ్యారు. చివరికి 191 పరుగులకు ఆల్ అవుట్ అయింది.తర్వాత చేదనకు దిగిన భారత్ బ్యాటర్లు సునాయాసంగా విజయాన్ని సాధించారు.

కెప్టెన్ రోహిత్ శర్మ అయితే వీరవిరోచితంగా పాక్ బౌలర్ల పైన విరుచుకుపడ్డాడు. కేవలం 30.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో భారత్ విజయం సాధించిన కూడా క్రికెట్ అభిమానులకు అంత మజా ఇవ్వలేదు అనేది నిజం. పాకిస్తాన్ ఆటగాల్లో ఇదివరకు ఉండేటి కసి కనిపించడం లేదు. భారత పాకిస్తాన్ మ్యాచ్ అంటే చివరి ఓవర్ వరకు ఉత్కంఠ రేపే విధంగా ఉండేది.

భారత్ ఓడిపోయిన సమయంలో దేశం మొత్తం కన్నీరు కార్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.
పాకిస్తాన్ ఎక్కువ శాతం మ్యాచుల్లో ఓడిపోయిన ప్రతిసారి పాక్ అభిమానులు టీవీలు బద్దలు కొట్టు మరి తమ నిరసన తెలియజేసేవారు.మళ్లీ భారత్-పాకిస్తాన్ మధ్య అలాంటి మ్యాచ్లు జరుగుతాయా ఆ పాత రోజులు మళ్ళీ వస్తాయా అంటూ క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


End of Article

You may also like