జీవితం ప్రతి ఒక్కరికి సెకండ్ ఛాన్స్ అనేది ఇస్తుంది. అందరూ లైఫ్ లో ఒకసారి ఫెయిల్ అయ్యాక లైఫ్ ముగిసిపోయింది అనుకుంటారు. కానీ లైఫ్ అనేది చాలా విధాలుగా మనకు అవకాశాలు ఇస్తుంది. ఆ సెకండ్ ఛాన్స్ వచ్చేటప్పుడు దాన్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకుంటాం అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు అలా లైఫ్ తనకిచ్చిన సెకండ్ ఛాన్స్ ని యూజ్ చేసుకుని సూపర్ స్టార్ అయ్యాడు ఇండియన్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ….

Video Advertisement

ప్రస్తుతం జరుగుతున్న 2023 ప్రపంచ కప్పులో సూపర్ స్టార్ ఎవరు? ఇండియన్ సూపర్ స్టార్ ఎవరు? అంటే టక్కును గుర్తొచ్చే పేరు మొహమ్మద్ షమీ. అన్ని దేశాల క్రికెటర్లతో పోల్చితే షమీ ముందు. ఎందుకంటే మొదటి 4 మ్యాచ్ లు ఆడకపోయినా లేటుగా ఛాన్స్ వచ్చినా కూడా ఈరోజు నెంబర్ వన్ వరల్డ్ కప్ బౌలర్ గా నిలబడ్డాడు అంటే అది షమీ టాలెంట్, కష్టానికి దక్కిన ప్రతిఫలం.

mistakes by team india in world cup semi finals
కానీ ఒక్కసారి షమీ గతానికి వెళ్లి చూస్తే మూడు సార్లు సూసైడ్ చేసుకోవాలని అనుకున్నాడని తానే స్వయంగా చెప్పాడు. తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. తన భార్య షమీ పైన గృహ హిం-స కేసు పెట్టి కోర్టుకు లాగింది. ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చి బిసిసిఐ షమీ నీ టీమ్ లో నుంచి దూరం పెట్టింది. ఒకపక్క కెరీర్ నాశనం అయ్యింది. మరో పక్క జీవితం కూడా నాశనం అయింది.మూడుసార్లు సూ-సై-డ్ అటెంప్ట్ చేశాడు. అప్పుడు తనకి అండగా నిలబడ్డది తన కుటుంబమే. తన కుటుంబం తన వెనకాల రాక్ లా నిలబడిందని షమీ చెప్పాడు.

3 shami hasina

తన స్నేహితులు ఇద్దరు ముగ్గురు 24 గంటలు షమీతోటే ఉంటూ తనకి మానసికంగా అండగా నిలబడ్డారని చెప్పాడు. ఒకసారి ఐపీఎల్ కి ముందు యాక్సిడెంట్ జరగడం మానసికంగా మరింత కృంగిపోయాడు. అలాంటిది అన్ని వడిదుడుకులను దాటుకుని డెహ్రాడూన్ లో మళ్ళీ ఆట పైన దృష్టి పెట్టాడు. చెమటను చిందించాడు. బాధను మరిచిపోవడానికి ఆటపైన కసి పెంచుకున్నాడు. జీవితం రెండో ఛాన్స్ ఇచ్చింది. దాని వెంటనే అదిమి పట్టుకున్నాడు. షమీ ఏంటి అనేద ప్రశ్నకు ఈ వరల్డ్ కప్ ద్వారా ప్రపంచానికి సమాధానం చెప్పాడు. ఈరోజు ఎక్కడ చూసినా షమీ నామ జపమే. సూ-సై-డ్ చేసుకోవాలని స్టేజి నుండి ఈరోజు సూపర్ స్టార్ అయ్యే స్టేజ్ కి ఎదిగిన షమీ జీవితం అందరికీ ఒక ఇన్స్పిరేషన్. శభాష్ షమీ… కీప్ ఇట్ అప్…

 

Also Read:2023 లో మన ఇండియన్ క్రికెటర్లు అందుకుంటున్న జీతాలు ఎంతో తెలుసా..? అందరికంటే ఎక్కువ సంపాదిస్తున్న ప్లేయర్ ఎవరంటే..?