అతిలోక సుందరి శ్రీదేవి గురించి తెలుగు వారికే కాదు యావత్ భారతదేశం లో ఉన్న ప్రేక్షకులందరికీ తెలుసు. శ్రీదేవి అంటే అలనాటి అందాల తార ఎంతోమంది కుర్రాళ్లకు కలల దేవత. శ్రీదేవి అందాన్ని వర్ణించడం సాధ్యం కాదు. జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలో స్వర్గం నుండి దిగివచ్చిన దేవకన్యగా నటించిన శ్రీదేవి, నిజ జీవితములో కూడా స్వర్గం నుండి వచ్చిందా అనేంత అందంగా ఉంటుంది.
సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన శ్రీదేవి తెలుగులో అలనాటి సూపర్ స్టార్లు సరసన నటించింది. సీనియర్ ఎన్టీ రామారావు దగ్గరనుండి వెంకటేష్, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ ఇలా తదితరులు అందరి సినిమాల్లోనూ శ్రీదేవి హీరోయిన్ గా నటించింది.
అయితే శ్రీదేవి తన మొదటి సినిమాకి అందుకున్న పారితోషకం ఎంతో తెలుసా…? తన మొదటి తమిళ్ సినిమాలో రజనీకాంత్, కమలహాసన్ పక్కన శ్రీదేవి నటించక దర్శకుడు బాలచందర్ ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. ముండ్రు ముడిచు అనే ఈ సినిమాకి శ్రీదేవికి 5000 రూపాయలు రెమ్యూనరేషన్ అందించారు. ఆ సినిమాలో నటించే సమయానికి శ్రీదేవి వయసు 13. అలాగే శ్రీదేవి 1975 సంవత్సరంలో తన హిందీ డెబ్యూ మూవీ జూలీలో నటించింది. తర్వాత స్టార్ స్టేటస్ అందుకున్న శ్రీదేవి ఉండగా ఉండగా హీరోలకి సమానంగా రెమ్యూనిరేషన్ డిమాండ్ చేసేది. కోటి రూపాయలు డిమాండ్ చేసిన మొదటి హీరోయిన్ గా శ్రీదేవి రికార్డు సృష్టించింది.
అయితే ఇప్పుడు శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ నటిస్తున్న మొదటి సౌత్ మూవీ జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాకి గాను జాహ్నవికి 3.5 కోట్ల రెమ్యూనరేషన్ అందిస్తున్నారు. తన తల్లి శ్రీదేవి మొదటి రెమ్యూనిరేషన్ తో పోలిస్తే జాహ్నవి రెమ్యూనరేషన్ ఎన్నో వేల రెట్లు ఎక్కువ.
అలాగే జాహ్నవి మొదటి హిందీ మూవీ ధడక్ గాను 60 లక్షల రూపాయలు అందించారు. శ్రీదేవి మొదటి సినిమాకి 5000 అందుకుని ఒక కోటి రూపాయల వరకు ఎదిగారు. అయితే జాహ్నవి 60 లక్షల నుండి 3.5 కోట్ల దగ్గరే ఆగిపోయారు. అప్పటికి ఇప్పటికీ రెమ్యూనరేషన్ స్థాయి వేరైనా కూడా, జాహ్నవి తో పోలిస్తే శ్రీదేవినే ఎక్కువ అందుకున్నట్లు. అయితే జాహ్నవి మొదట హిట్ కొట్టిన తర్వాత ఆరు కోట్లు డిమాండ్ చేసేవారు. తర్వాత వరుస ఫ్లాపులు రావడంతో 3.5 కోట్లకి రెమ్యూనరేషన్ తగ్గించుకున్నారు.
Also Read:ఇంస్టాగ్రామ్ లో 1.2 మిలియన్ ఫాలోవర్స్…కానీ ఎన్నికల్లో 2292 ఓట్లు మాత్రమే వచ్చాయి.! ఆమె ఎవరంటే.?