తెలుగు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్, రష్మిక మందన జంటగా వస్తున్న చిత్రం యానిమల్.ఈ చిత్రం డిసెంబరు ఒకటో తారీఖున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన ట్రైలర్లు, పాటలు బాగా ఆకట్టుకున్నాయి. అయితే తెలుగులో తాజాగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.ఈవెంట్ గా చీఫ్ గెస్ట్ లుగా రాజమౌళి, మహేష్ బాబులు హాజరయ్యారు.
యానిమల్ సినిమా కథను డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ముందుగా మహేష్ బాబుకు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అయితే అది ఈ కథ కాదని వేరే కథ అంటూ డైరెక్టర్ క్లారిటీ ఇచ్చారు. తాజాగా మహేష్ బాబు యానిమల్ సినిమాలో యాక్ట్ చేస్తే ఎలా ఉంటుంది అంటూ ఒకరు డీప్ ఫేక్ వీడియోను సృష్టించి సోషల్ మీడియాలో పెట్టారు.
యానిమల్ ట్రైలర్ ని రణబీర్ కపూర్ స్థానంలో మహేష్ బాబును పెట్టి విడుదల చేస్తారు. ఈ సినిమాలో అనిల్ కుమార్ పాత్రలో ప్రకాష్ రాజుని బాబీ డియోల్ పాత్రలో సోను సూద్ ని రీప్లేస్ చేశారు. అయితే ఈ వీడియో ఇప్పుడు విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. రెండు రోజుల్లో 40 వేల లైక్స్ వచ్చాయి అంటే ఈ వీడియో ఎంత వైరల్ అయిందో అర్థం చేసుకోవచ్చు.అయితే ఈ వీడియోకి మిశ్రమ స్పందన వచ్చింది. పలువురు రకరకాలుగా కామెంట్లు చేశారు. ఒకరైతే రణబీర్ కపూర్ ల మహేష్ బాబు గడ్డం పెంచలేరని కామెంట్ చేశారు.
మరొకరైతే కేజిఎఫ్ హీరో యాష్ అయితే భలే ఉంటాడు అంటూ కామెంట్ చేశారు. అయితే ఇలాంటి ఎగ్ రైస్ పాత్రను మహేష్ బాబు గతంలో కూడా చేశారు ఈ పాత్రను మహేష్ బాగా చేయగలరు అంటూ పలువురు కామెంట్ చేశారు.అయితే కొందరు ఈ వీడియో ఎడిటింగ్ పైన కూడా నెగటివ్ కామెంట్ లు చేస్తున్నారు.ఇది ఇలా ఉంటే యానిమల్ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా క్రేజ్ పెరిగింది. రాజు ఈ సినిమాని భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. అర్జున్ రెడ్డి సినిమాను మించి యానిమల్ హిట్ అవుతుందని అంచనా వేస్తున్నారు.
Watch Video:
https://www.instagram.com/reel/C0HJNQmPA5q/?utm_source=ig_embed&ig_rid=da3fb802-99b6-432c-b3e8-036471e16f7d
Also Read:రాధ కూతురికి ఎంత కట్నం ఇచ్చారో తెలుసా..?