ప్రస్తుతం నిత్యవసర వస్తువులన్నీ రేట్లు పెరిగి ఆకాశాన్ని అంటుతున్నాయి. ఏ వస్తువు చూసుకున్న కేజీ ₹100 పైనే ఉంది. ఈ ధరలు చూసి మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్లు గొడవ పెడుతూ ఉంటారు. అమ్మో ఇంత రేట్ల ఆ రోజుల్లోనే మంచిది కదా అని. వారి మాటలు విన్న మనకి ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఏంటి వీళ్లు ఏ కాలంలో బతుకుతున్నారు అనుకుంటాం. కానీ వాళ్ళు చెప్పేది కూడా నిజమే ఎందుకంటే మనం ప్రస్తుతం ఒక కేజీ గోధుమపిండికి ఎంత చెల్లిస్తాం. 60 రూపాయలు లేక 50 రూపాయలు. కానీ 1987లో కేజీ గోధుమ పిండి ధర ఎంత ఉందో తెలుసా…?
కేవలం 1.6 రూపాయలు… షాక్ అయ్యారా..! మీరు విన్నది నిజమే. ఇప్పుడు రేట్లకి అప్పటి రేట్లకి ఏమన్నా సంబంధం ఉందా. అందుకే ఇప్పుడున్న రేట్లు చూసి మన పెద్దవారు గొడవ పెడుతూ ఉంటారు. ఆశ్చర్యంగా 1987 లోను కేజీ గోధుమ ధర రేటు ఉన్న బిల్లు బయటకు వచ్చింది. ఇది బయట పెట్టింది ఎవరో కాదు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ ప్రవీణ్ కస్వన్. తన ట్విట్టర్ అకౌంట్ లో తన తాత దాచిన బిల్లును పోస్ట్ చేశారు. 1987లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేజీ గోధుమపిండిని 1.6 రూపాయలకి కి అమ్మింది.
తన తాతకి పాత రసీదులు దాచే అలవాటు ఉండటం వల్ల తాను ఇప్పుడు ఈ రసీదును కనుగొనడం సులువు అయిందని కస్వన్ చెప్పుకొచ్చారు. తన తాత గత 40 ఏళ్లుగా అమ్మిన పంటల వివరాల డాక్యుమెంట్లన్నీ తన వద్ద ఉన్నట్లు తెలిపారు.వాటిలో కొన్ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.24 గంటలు గడవక ముందే ఆ పోస్ట్ కి 44 వేల లైకులు, ఎన్నో వేల కామెంట్లు వచ్చాయి. చాలామంది ఆ బిల్లును షేర్ చేసినందుకు ప్రవీణ్ కస్వన్ కి థాంక్స్ చెబుతున్నారు.
ఇన్ని సంవత్సరాల్లో ఇన్ఫ్లేషన్ రేటు ఎలా పెరిగిపోయింది అనేది తెలుస్తుంది అంటూ చెప్పుకొస్తున్నారు. కాకపోతే కొంతమంది అయితే గోధుమపిండి వెయిట్ అలాగే ఉంది కానీ రూపాయి వెయిట్ అయితే పడిపోయింది అంటూ కామెంట్ పెట్టారు. ఇంకొకరైతే 1987లో గోల్డ్ రేటు రూ. 2570 ఉండగా ఇప్పుడు దానికి 20 రెట్లు పెరిగిందని అన్నారు. ఇంకొకరైతే మన పెద్దవాళ్ల నుండి చాలా నేర్చుకోవాలి అంటూ కామెంట్ పెట్టారు.
Also Read: 50 దాటినా కూడా “టబు” ఎందుకు పెళ్లి చేసుకోలేదు..? ఆ బాలీవుడ్ హీరోని ప్రేమించారా..?