అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగులో ఒక సెన్సేషన్ సృష్టించాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. సినిమా పూర్తయ్యకా విడుదలకుండా ఎన్నో ఇబ్బందులు పడ్డ అర్జున్ రెడ్డి ఒక్కసారి విడుదలయ్యాక ఇండియాలోనే సెన్సేషన్ అయిపోయింది. అప్పటివరకు వచ్చిన సినిమాల ఫార్మేట్ ని అర్జున్ రెడ్డి మార్చేసింది. పెద్ద పెద్ద హీరోలు అన్ని ఇండస్ట్రీలు వారు అర్జున్ రెడ్డిని ఆకాశానికి ఎత్తేశారు. తర్వాత సందీప్ రెడ్డి వంగా హిందీలో అర్జున్ రెడ్డిని కబీర్ సింగ్ పేరుతో అక్కడ రూపొందించగా బాలీవుడ్ లో కూడా సూపర్ డూపర్ హిట్ అయింది.
వెంటనే సందీప్ రెడ్డి వంగా కి బాలీవుడ్ ఆఫర్ వచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది. రణబీర్ తో సందీప్ రెడ్డి వంగా యానిమల్ అనే సినిమాని రూపొందించాడు. టైటిల్ దగ్గర నుండి ఈ సినిమా అందరిని ఆకర్షించింది.
తాజాగా డిసెంబర్ ఒకటో తారీఖున ఈ సినిమా రిలీజ్ కానుంది. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ చిత్రం మీద ఎక్స్పెక్టేషన్స్ ని భారీ లెవెల్ లో పెంచేసింది. ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా సందీప్ రెడ్డి మార్క్ కనిపించింది అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలు లెంగ్త్ కూడా 3:21 నిమిషాలు ఉంది. తండ్రి కొడుకుల మధ్య రిలేషన్ చూపించే విధంగా ఈ సినిమా ఉంటుందని డైరెక్ట్ తెలియజేశారు.
అయితే తెలుగు రాష్ట్రాల హక్కులను 15 కోట్ల రూపాయలకు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తీసుకున్నారు. యానిమల్ సినిమాని భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. అయితే ఇప్పటివరకు దిల్ రాజు ఏ బాలీవుడ్ మూవీ ని కూడా ఇంత పెట్టి కొన్నది లేదు. ఫస్ట్ టైం యానిమల్ సినిమా విషయంలో దిల్ రాజు రిస్క్ చేస్తున్నాడా అంటూ సినీ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.యానిమల్ సినిమాకు ఉన్న క్రేజ్ చూస్తే హిట్ టాక్ వచ్చినా కూడా సినిమా 15 కోట్లు దాటి వసూలు చేయడం పెద్ద కష్టమేమీ కాదు.
Also Read:అప్పుడు ఆర్తి అగర్వాల్… మొన్న కృతి శెట్టి… ఇప్పుడు శ్రీలీల..! ఇదే తప్పు చేశారా..?