క్రికెట్ లో థర్డ్ అంపైర్ డెసిషన్ రివ్యూ చేస్తునప్పుడు కొన్ని సార్లు తన డెసిషన్ అంపైర్ కాల్ తోనేకిభవిస్తునట్లు చెప్తారు. అసలు చాలామంది ఫ్యాన్స్ కి అంపైర్ కాల్ అంటే ఏమిటో అర్థం కాదు. డెసిషన్ రివ్యూ సిస్టంలోనూ ,ఎల్ బి డబ్ల్యు లోను కొన్ని రూల్స్ కూడా కన్ఫ్యూజన్ గా ఉంటాయి. అయితే నిన్న జరిగిన వరల్డ్ కప్ ఫైనల్లో అంపైర్ కాల్ వల్ల ఇండియా తీవ్రంగా నష్టపోయింది.
అసలు అంపైర్ కాల్ అంటే ఒక బౌలర్ బాల్ వేసినప్పుడు అది బ్యాట్స్ మెన్ ప్యాడ్లను తాకితే బౌలర్ ఎల్ బి డబ్ల్యూ ఆపిల్ చేస్తాడు. ఒకవేళ అంపైర్ దాన్ని ఔట్ గా ప్రకటించిన బ్యాట్స్ మెన్ దాంతో ఏకీభవించకపోతే డిఆర్ఎస్ కోరతాడు. అలాగే ఒకవేళ అంపైర్ నాట్ అవుట్ ఇచ్చిన కూడా బౌలర్ అవుట్ అనుకుంటే అప్పుడు కూడా డిఆర్ఎస్ కోరే అవకాశం ఉంది.
అంపైర్ డెసిషన్ ఛాలెంజ్ చేసినప్పుడు థర్డ్ ఎంపైర్ దాన్ని రివ్యూ చేస్తాడు.అప్పుడు బౌలర్ వేసిన బాల్ పిచ్ లైన్ లో ఉందా లేదా, వికెట్లను తాకుతుందా లేదా అనేది క్లియర్ కట్ గా రివ్యూ చేసి థర్డ్ ఎంపైర్ డెసిషన్ చెప్తాడు. ఇలాంటి సందర్భాల్లో ఎక్కువ శాతం అవుట్ అవ్వడానికి అవకాశాలు ఉంటే దాన్ని అవుటుగా ప్రకటిస్తాడు. కొన్ని కొన్ని సార్లు అవుట్ అయ్యే అవకాశం ఉన్న అది చాలా తక్కువ శాతం ఉంటుంది. అప్పుడు థర్డ్ అంపైర్ తన డిసిషన్ ను అంపైర్ కాల్ తో ఏకీభవిస్తాడు.
నిన్న జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో కూడా అదే జరిగింది. 28వ ఓవర్ లో బూమ్ర బౌలింగ్ వేస్తున్నాడు. ఆస్ట్రేలియన్ బ్యాట్స్ మెన్ మారనస్ లభుషాంగే బ్యాటింగ్ చేస్తున్నాడు. ఆ బాల్ ప్యాడ్లను తాకగా బూమ్ర ఎల్ బి డబ్ల్యు ఆపిల్ చేశాడు. అయితే ఎంపైర్ కెటిల్ బోరోగ్ నాటౌట్ గా ప్రకటించాడు. అప్పుడు డిఆర్ఎస్ కోరినా కూడా థర్డ్ అంపైర్ రివ్యూ చేసి అంపైర్ కాల్ తో ఏకీభవించి అది నాట్ అవుట్ గా ప్రకటించాడు. అలాగా ఎంపైర్ కాల్ నిన్న ఇండియా కొంపముంచింది. ఒకవేళ అది అవుట్ గా ప్రకటిస్తే మ్యాచ్ టర్న్ అయ్యే అవకాశం లేకపోలేదు.
Also Read:ఆ యాడ్స్ ని గ్రౌండ్ పై పెయింట్ వేయరా.? దీనివెనకాల ఇంత పెద్ద కథ ఉందా.?