చాలా సినిమాలు రిలీజ్ అయినప్పుడు పెద్దగా జనాలని ఆకర్షించవు. కొన్ని కొన్ని సినిమాలు చూడడానికి చాలా బాగుంటాయి. ఫీల్ గుడ్ గా కూడా అనిపిస్తాయి. అయితే ఎంత సూపర్ గుడ్ మూవీ అయిన, ఎంత బ్లాక్ బస్టర్ సినిమా అయిన సరే నెల తర్వాత ఓటిటి లో ప్రత్యక్షమవుతుంది. అదే ఫ్లాప్ అయిన మూవీ అయితే వారానికే ఆన్ లైన్ లో పెట్టేస్తున్నారు. అలాంటిది ఒక మూవీ రిలీజ్ అయిన ఏడాది తర్వాత ఇప్పుడు ఓటిటి కి వచ్చింది. ఆ మూవీనే జెట్టి.
ఒక్క సాంగ్ తో బాగా ఫేమస్ అయిన మూవీ…!ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. శుక్రవారం (నవంబర్ 17) నుంచే ఈ మూవీ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది.
మత్స్యకారుల జీవితానికి ఒక చక్కటి ప్రేమకథను జోడించి సుబ్రహ్మణ్యం పిచ్చుక దర్శకత్వంలో ఈ మూవీని తెరకెక్కించారు. మాన్యం కృష్ణ, నందిత శ్వేతా హీరో, హీరోయిన్ లుగా నటించారు. తేజస్విని బెహెర, ఎంఎస్ చౌదరి, జి.కిశోర్, గోపి, జీవ, శివాజీ రాజా, సుమన్ శెట్టి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. గతేడాది (2022) నవంబర్ 4వ తేదీ థియేటర్లలో విడుదలైన జెట్టీ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. గ్రామీణ నేపథ్యం, అక్కడి కట్టుబాట్లు, ఆచార సంప్రదాయాలు, మత్స్యకారుల జీవన విధానాన్ని ఉట్టిపడేల జెట్టీ మూవీని తెరకెక్కించారని కామెంట్లు వచ్చాయి.
ఈ సినిమాలో సిద్దు శ్రీరామ్ పాడిన మెలోడీ సాంగ్ యూట్యూబ్ చాట్ బస్టర్ గా నిలిచింది. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ నందమూరి బాలకృష్ణ తదితరులు ఈ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. ఈ మూవీ చూసిన ఆడియోస్ అందరూ కూడా మంచి ఫీల్ గుడ్ మూవీ అంటూ రివ్యూ ఇచ్చారు. ఫీల్ గుడ్ మూవీస్ కి ఎప్పుడు ఆదరణ లభిస్తుంది కాబట్టి ఈ మూవీ కూడా ఆహా లో మంచి హిట్స్ సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. లాంగ్ రన్ లో బాగా క్లిక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
Also Read:తెలుగులో అదరగొడుతున్న యానిమల్ సినిమా బుకింగ్స్.. రెస్పాన్స్ మాములుగా లేదుగా?