చాలామంది అధిక బరువుతో బాధపడుతూ ఉంటారు. ఎన్నో కసరత్తులు చేసి బరువు తగ్గాలనుకుంటారు. చాలామంది బరువు తగ్గడానికి నోరు కట్టేసుకుంటారు కూడా. అయితే హర్యాన లోని రేవారీకి చెందిన ఆశిష్ సెచ్ దేవా అనే వ్యాపారవేత్త ఒకప్పుడు దాదాపు 140 కిలోల బరువు ఉండేవాడు. అయితే అతను రెండున్నర సంవత్సరాల్లో 60.9 కిలోల బరువు తగ్గగలిగాడు.
అయితే తన బరువు తగ్గడానికి గల స్టోరీని ఆశిష్ చెప్పుకొచ్చాడు.
“నేను గతంలో 140 కిలోల బరువు ఉండేవాడిని. టెక్నికల్ గా నేను ఉబకాయంతో ఉన్నాను. నా సైజు డ్రెస్సెస్ దొరకడం చాలా కష్టం అయ్యేది. నేను నా దుస్తులు కొనడానికి జీన్స్ కుట్టించుకోవడానికి ఢిల్లీ వెళ్లేవాడిని. నా ఓవర్ వెయిట్ కారణంగా హైపర్ టెన్షన్, కీళ్ల నొప్పులు, జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి సమస్యలతో ఇబ్బంది పడే వాడిని అని చెప్పుకొచ్చాడు.

ఆర్ట్ ఆఫ్ లివింగ్ ద్వారా నేను ఆధ్యాత్మికతకు బాగా కనెక్ట్ అయ్యా. ఆధ్యాత్మిక ఆలోచనలు నా ప్రపంచ దృష్టి కోణం, విలువలు, జీవిత విధానాన్ని మార్చాయి.. నేను ధ్యానం చేయడం ప్రారంభించాను. నా బలహీనతలను కనుగొన్నాను.ధ్యానం నా గురించి నాకు చాలా విషయాలను నేను తెలుసుకుని చేసింది. నా వెయిట్ లాస్ జర్నీకి మార్గం చూపించింది అని చెప్పాడుగతంలో 2010లో బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ అది కుదరలేదు. ఎంత కష్టపడ్డా 10 నెలల్లో ఒక కిలో బరువు మాత్రమే తగ్గాను.ఇది నాకు పెద్ద సవాలుగా మారింది. అయినా నేను నా లక్ష్యాన్ని విడిచిపెట్టలేదు.

కష్ట సమయాలు మానవ అనుభవంలో ఒక భాగమని గుర్తించుకోవడం చాలా ముఖ్యం. చివరికి నా ప్రయత్నాలు విజయం సాధించాయి. మంచి రిజల్ట్ కూడా తీసుకొచ్చాయని చెప్పుకొచ్చాడు.ఈ బరువు తగ్గడంలో ముఖ్యంగా తను దృష్టి పెట్టిన విషయాలను చెప్పుకొచ్చాడు. రాత్రిపూట త్వరగా నిద్రపోవడం, తెల్లవారుజామున నిద్ర లేవడం. జంక్ ఫుడ్, చెక్కర పదార్థాలకు దూరంగా ఉండడం చేసేవాడిని అన్నాడు. తన ఆహార నియమాలు కూడా చెప్పాడు.బ్రేక్ ఫాస్ట్ లో 4 ఎగ్ వైట్, రెండు గుడ్లు, ఓట్స్ తినేవాడు. భోజనంలో సలాడ్లు, పండ్లు ఒక కప్పు సీజనల్ కూరగాయలు, ఒక కప్పు పెరుగు తినేవాడు.

డిన్నర్ లో నాలుగు గుడ్డులోని తెల్లసోన, రెండు ఫుల్ గుడ్లు, రెండు మల్టీ గ్రేయిన్ రోటీస్, ఒక గిన్నె పప్పు, సలాడ్లు తినేవాడు. వ్యాయామానికి ముందు రైస్ కేక్, పీనట్ బటర్ ,వ్యాయామం తర్వాత ప్రోటీన్ షేక్, నట్స్ తీసుకునేవాడు అని చెప్పాడు.మూడు నాలుగు రోజులు స్ట్రెంత్ ట్రైనింగ్, ఒక రెండు రోజులు కార్డియోవాస్కులర్ వ్యాయామం, స్త్రెచింగ్,ఒక రోజు యోగా చేసేవాడు. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడమే కాకుండా శరీరానికి విశ్రాంతి, ప్రశాంతమైన నిద్ర అవసరమని సచ్ దేవా తెలిపాడు.
Also Read:చనిపోతూ కూడా ఈ AP సచివాలయ ఉద్యోగిని చేసిన ఈ పనికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.!








మన హెల్దీగా ఉండాలంటే నీరు అనేది తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రతిరోజు 10 నుంచి 12 గ్లాసుల నీటిని తాగితే ఆరోగ్యంగా ఉంటాం.. కానీ కొంతమంది తాగాల్సిన టైంలో కాకుండా మిగతా టైం లో నీరు తాగుతూ ఉంటారని దీని వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని కొంతమంది నిపుణులు తెలియజేస్తున్నారు.. తిన్న వెంటనే నీరు తాగొచ్చా.. ఏంటో ఒక సారి చూద్దాం..!!
అయితే తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు అని వైద్య నిపుణులు అంటున్నారు. ఎందుకంటే జీర్ణక్రియ నిర్వహణ అనేది అప్పుడే ప్రారంభం అవుతుంది. మనం తిన్న ఆహారం జీర్ణం కావడానికి రెండు గంటల సమయం పడుతుంది.. ఈ క్రమంలో నీరు తాగితే జీర్ణక్రియ వేడి తగ్గుతుంది. దీని వల్ల అది జీర్ణ వ్యవస్థ పై ప్రభావితం అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో నీళ్లు తాగడం వల్ల ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, ఇలాంటి సమస్యలు వస్తాయని నిపుణులు తెలియజేస్తున్నారు..
వ్యక్తి తిన్న తర్వాత ఒక గంట విరామం తీసుకొని నీరు తాగితే అతని బరువును నియంత్రించ వచ్చు.అలాగే ఉదయం లేవగానే రెండు గ్లాసుల నీటిని తాగితే జీర్ణ వ్యవస్థ బలంగా తయారవుతుంది.