అసలు ప్రశ్న ఏంటి ? మీ జవాబు ఏంటి ? మిమల్ని ట్రోల్ చెయ్యడం లో తప్పు లేదు !

అసలు ప్రశ్న ఏంటి ? మీ జవాబు ఏంటి ? మిమల్ని ట్రోల్ చెయ్యడం లో తప్పు లేదు !

by Mounika Singaluri

Ads

ప్రస్తుతం 2023 క్రికెట్ ప్రపంచ కప్ హడావిడి నడుస్తుంది. అన్ని దేశాలలోనూ ఈ క్రికెట్ ఫీవర్ కొనసాగుతుంది. అన్ని దేశాల అభిమానులు తమ జట్టులకు మద్దతు తెలుపుతూ విజయాలను సాధించాలని ఆశిస్తున్నారు. ఈ టోర్నమెంట్ స్టార్టింగ్ లో భారత దేశ చిరకాల ప్రత్యర్థ్యాన్ని పాకిస్తాన్ మంచి ప్రదర్శన కనబరిచింది.

Video Advertisement

నెదర్లాండ్స్, శ్రీలంక జట్ల మీద మంచి విజయాన్ని నమోదు చేసుకుంది.అయితే తర్వాత ఇండియా, ఆస్ట్రేలియా లాంటి మేటి జట్లపైన చిత్తుచిత్తుగా ఓడింది.ప్రస్తుతం పాకిస్తాన్ పాయింట్ల టేబుల్ లో 5వ స్థానంలో ఉంది.

సోమవారం జరిగిన మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో కూడా పరాజయం పాలైంది. ఈ మ్యాచ్ కు ముందుగా పాకిస్తాన్ ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ అయిన ఇమామ్ – ఉల్ – హక్ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. తమ బ్యాట్స్ మెన్స్ నుంచి పెద్దపెద్ద హిట్లు రాకపోవడానికి గల కారణం మంచి డైట్ లేకపోవడమే అని అన్నాడు. ఇప్పటివరకు వరల్డ్ కప్ లో పాకిస్తాన్ మాత్రమే మొదటి 10 ఓవర్లలో ఒక్క సిక్స్ కూడా కొట్టలేకపోయింది. దానిపై అతను స్పందిస్తూ… పెద్ద పెద్ద సిక్సులు కొట్టాలంటే తమ టీం కి మంచి ప్రోటీన్స్ ఉన్న భోజనం అవసరమని అన్నాడు.

ఇక్కడ జరిగే అన్ని మ్యాచ్లు కూడా అధిక స్కోర్లు వచ్చాయి అది కేవలం తమ టీం మీద మాత్రమే కాదని మిగతా టీంలో కూడా జరిగిందని అన్నారు. కేవలం తమ బౌలర్లు మాత్రమే రన్స్ ఇవ్వలేదు అని అన్నారు.తమ ఆటగాళ్ల పేలవ పెర్ఫార్మన్స్ పైన అతను మాట్లాడుతూ… ఇక్కడ గ్రౌండ్లు కూడా చాలా చిన్నగా ఉన్నాయి. వికెట్ బాగుంది, బ్యాట్స్ మెన్ కూడా సెట్ అయ్యి ఉన్నారు.దాని కారణంగా బౌల్లెర్స్ కి మార్జిన్ చాలా తక్కువ లభించింది అని అన్నారు.

ఇక్కడ పరిస్థితులు అలా ఉన్నాయని కొన్ని కొన్ని సార్లు తమ బౌలర్ షహెన్షా ఆస్ట్రేలియా మీద ఎక్కువ స్కోరు ఇవ్వడం జరిగిందని తెలిపారు.ఇక్కడ పరిస్థితులు అలా ఉన్నాయని కొన్ని కొన్ని సార్లు తమ బౌలర్ షహెన్షా ఆస్ట్రేలియా మీద ఎక్కువ స్కోరు ఇవ్వడం జరిగిందని తెలిపారు.
ఇక్కడ పరిస్థితులు అలా ఉన్నాయని కొన్ని కొన్ని సార్లు తమ బౌలర్ షహెన్షా ఆస్ట్రేలియా మీద ఎక్కువ స్కోరు ఇవ్వడం జరిగిందని తెలిపారు.మేము ప్రతికూలతని మరిచిపోయి రాబోయే ముందు మ్యాచ్ లపై దృష్టి పెట్టడానికి ప్రయత్నిస్తున్నామని అన్నారు. పాకిస్తాన్ క్యాంప్లో పాజిటివ్ యాటిట్యూడ్ ఉందని, మేము ఖచ్చితంగా రికవర్ అవుతామని తెలియజేశాడు.


తమ టీము ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తినడం కంటే ప్రోటీన్స్ తినడం మంచిదేమో అని అన్నాడు. సిక్స్ లు కొట్టకపోయిన, ఫోర్ లు కొట్టకపోయినా మేము పట్టించుకోమని, తమ టీం కోసం మేము ఏమి చేస్తున్నామన్నది ముఖ్యమని అన్నాడు. గత రెండు మ్యాచ్లు సరిగా ఆడలేదనేది ఒప్పుకునే విషయం అని అన్నాడు. ఇంకా తమ చేతిలో ఐదు మ్యాచ్లు ఉన్నాయని, కచ్చితంగా సెమీఫైనల్స్ కి వెళ్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

Also Read:మొన్న ఇంగ్లాండ్, ఇవాల పాక్, ఆఫ్ఘన్ విజయంలో కీలక పాత్ర పోషించిన మన భారతీయుడు ఎవరో తెలుసా ?


End of Article

You may also like