HIT 2: శైలేష్ కొలను డైరెక్షన్ లో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా వచ్చిన సినిమా ‘హిట్ 2’. ఇందులో అడివి శేష్,హీరోయిన్ మీనాక్షి చౌదరి జంటగా నటించారు. హీరో నాని సమర్పణలో ప్రశాంతి త్రిపిర్నేని ది వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ఈ మూవీని నిర్మించారు. ఈ నెల 2న విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది.
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ రొటీన్‌కు భిన్నంగా వెళ్తోంది. ఒక్క కమర్షియల్ అంశాలే ముఖ్యం కాదు. కంటెంట్ కూడా కీలకమేనని ప్రేక్షకులు అంటున్నారు. కంటెంట్ ఉన్న సినిమాలను సక్సెస్ చేసి చూపిస్తున్నారు. దీనితో డైరెక్టర్స్, నిర్మాతలు రొటీన్ చిత్రాలను కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న మూవీస్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో హిట్స్ అందుకుంటున్నారు. అలా రీసెంట్ గా వచ్చిన సినిమా హిట్ 2. అడివి శేష్ నటించిన ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహించారు.
హీరో నాని హిట్ 2 సినిమాకు హిట్ టాక్ వచ్చిన సందర్భంగా ఈ మూవీ గురించి మాట్లాడారు. నాని ఈ క్రమంలో ఓ ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశారు. హిట్ 2 జర్నీలో మూవీ యూనిట్ గురించి మాట్లాడుతూ ‘వాల్ పోస్టర్ సినిమా మొదలు పెట్టి, కొత్త ఐడియాలతో న్యూ టాలెంట్‌ను ప్రోత్సహించాలని అనుకున్నాను. రొటీన్ సినిమాలు చేయకూడదనే ఈ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ ని ప్రారంభించాను. డిఫరెంట్ గా ఉండే సినిమాలను చేస్తే ఎవరు చూడరు. అసలు ఇది వర్కవుట్ అవుతుందా? అని చాలా మంది నన్ను భయపెట్టారు.
అయితే తెలుగు ఆడియెన్స్ డిఫరెంట్ మూవీస్ చూస్తారనే ధైర్యం, నమ్మకం ఉంది. ఇప్పడది ఇంకోసారి హిట్ 2 తో రుజువైంది’ అన్నారు. హీరో నాని సమర్పకుడిగా, ప్రశాంతి త్రిపిర్నేని నిర్మాతగా మరి వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌ను మొదలు పెట్టారు. ఈ బ్యానర్లో తీసిన మొదటి సినిమా అ!. ఈ సినిమాతో ప్రశాంత్ వర్మ దర్శకుడిగా మారారు. ఆ తరువాత శైలేష్ కొలనుని డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ చేస్తూ హిట్ యూనివర్స్ మొదలుపెట్టారు.

మేకర్స్ కనుక ట్విస్ట్ గురించి మాట్లాడకుండా ఉండి ఉంటే మూవీకి ప్లస్ గా మారేదని నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమా సంజన అనే బాధితురాలిని దారుణంగా హత్య చేసిన కేసును ఇన్వెస్ట్ గేట్ చేయడానికి వచ్చిన ఎస్పీ రేంజ్ పోలీసు కృష్ణ దేవ్ (అడివి శేష్) చుట్టూ సినిమా తిరుగుతుంది. సంజనలాగే అనేక మంది మహిళలకు జరిగిందని అతను తరువాత తెలుసుకుంటాడు. కృష్ణ దేవ్ కిల్లర్‌ని ఎలా పట్టుకుంటాడు అనేది సినిమా కథ.
హిట్: ది సెకండ్ కేస్ థియేట్రికల్ రిలీజ్ మొదటి రోజు, ఇండియా వైడ్ గా అన్ని కేంద్రాల నుండి దాదాపు రూ. 6 కోట్లు రాబట్టింది. థియేటర్ల ఆక్యుపెన్సీ రేషియో కూడా డీసెంట్‌గా నమోదైంది మరియు రోజు చివరి నాటికి మెరుగుపడింది. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిచింది. సుహాస్, రావు రమేష్, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణ మురళి, కోమలి ప్రసాద్, మాగంటి శ్రీనాథ్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషించారు. దర్శకుడు శైలేష్ కొలను ప్లాన్ చేసిన హిట్ వర్స్ లో HIT 2 రెండవ సినిమా.
అడవి శేషు హీరోగా హిట్ 2 అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.నేచురల్ స్టార్ నాని మరియు ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ మూవీకి శైలేష్ కొలను డైరెక్టర్. డిసెంబర్ 2న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. దాంతో ఒక జర్నలిస్ట్ హిట్ సిరీస్ మూవీస్ లో సమంత లాంటి స్ట్రాంగ్ ఫిమేల్ విలన్ గా చేస్తే బావుంటుండి అని ట్వీట్ చేసాడు. అయితే దీనిని అడవి శేషు రీ ట్వీట్ చేయడమే కాక, ఇది అద్భుతమైన ఆలోచన సమంత ఏమంటావ్ అని సమంతను అడిగాడు. దానికి సమంత సమాధానంగా బాడ్ యాస్ కాప్,ఇది వినడానికి చాలా ఫన్నీగా ఉంది అని కామెంట్ పెట్టింది.
అంతేకాక నీ సినిమా హిట్టు అయినందుకు కంగ్రాట్స్, నిన్ను ఎప్పటికీ చీర్ చేస్తూనే ఉంటా అని కామెంట్ చేసింది. అయితే సమంత హిట్ సిరీస్ లో నటించే అవకాశాలు ఉన్నాయని హింట్ ఇచ్చేసింది. ఇంకో వైపు సమంత అభిమానులు ఆమె ట్వీట్ చేసిందంటే అనారోగ్యంతో లేదని, బాగానే ఉందని సంతోషపడుతున్నారు. ఇది ఇలా ఉంటే, హిట్ సిరీస్‌ను 8 భాగాలుగా రూపొందించాలని మేకర్స్ ఆలోచిస్తున్నారు. హిట్ 2 ప్రమోషన్స్ లోనే 3వ పార్ట్ గురించి తెలిపారు. అయితే హిట్ 3 లో నాని హీరోగా, కీలక పాత్రలో అడివి శేష్ నటిస్తాడని తెలిపారు.

