కన్నడలో 2019లో వచ్చిన థ్రిల్లర్ మూవీ కవలుధారి. కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ప్రొడక్షన్ హౌజ్ పి.ఆర్ .కె లో వచ్చిన ఈ మూవీకి హేమంత్ రావు డైరెక్టర్. రిషి, అనంతనాగ్,అచ్యుత్ కుమార్,సుమంత్ రంగనాథ్,రోషిని ప్రకాష్ లీడ్ రోల్స్ చేశారు. అద్వైత గురుమూర్తి ఈ మూవీకి డిఓపి గా పని చేయగా చరణ్ రాజ్ సంగీతం అందించారు. ఏప్రిల్ 12, 2019 లో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ గా నిలిచింది.
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే శ్యామ్ ఒక ట్రాఫిక్ ఎస్ఐ. నిజానికి అతనికి క్రైమ్ రిలేటెడ్ కేసులు డీల్ చేయడం అంటే బాగా ఇష్టం. అనుకోకుండా అతనికి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి అస్తిపంజరాలు లు కనిపిస్తాయి. ఆ కేసును డీల్ చేయాలని ఇంట్రెస్ట్ చూపిస్తాడు. పై ఆఫీసర్లు వార్నింగ్ ఇచ్చినా కూడా పట్టించుకోడు.
ఇన్వెస్టిగేషన్ లో అతనికి తెలిసిందేమిటంటే అవి నాలుగు దశాబ్దాల కాలం క్రితానివి అని. ఫోరన్సిక్ రిపోర్టులో వాళ్లని మర్డర్ చేసినట్లుగా వస్తుంది. శ్యామ్ కుమార్ అనే ఒక జర్నలిస్ట్ సహాయం తీసుకుంటాడు. ఈ కేసులో అతనికి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. చనిపోయిన కుటుంబానికి సురేష్ అనే వ్యక్తి పెద్ద అని తెలుస్తుంది.అతను ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉంటాడు. సంపత్ అనే వ్యక్తి తో కలిసి విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన నగలను వెతికే పనిలో ఉంటారు. అనుకోకుండా అదే రోజు సంపత్ కూడా చనిపోతాడు. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేసిన రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ముత్తన్న, మాధురి రాకతో శ్యామ్ కి కేస్ డీల్ చేయడం మరింత కాంప్లికేట్ అవుతుంది. ముత్తన్న శ్యామ్ కి హెల్ప్ చేయడానికి వస్తాడు.
అసలు ఈ మర్డర్ వెనకాల ఉంది ఎవరు? ఈ కథకి మాధురి అనే పాత్రకి సంబంధం ఏమిటి? కర్ణాటక కి కాబోయే ముఖ్యమంత్రి కి మాధురికి ఉన్న లింక్ ఏంటి…? ఫైనల్ గా శ్యామ్ ఈ కేసు ను ఎలా సాల్వ్ చేశాడు అన్నది మిగతా కథ .మెయిన్ లీడ్ గా నటించిన రిషి తన నటనతో ఆద్యంతం ఆకట్టుకుంటాడు. ఇన్వెస్టిగేషన్ ఇలా చేస్తారా అని అనిపిస్తుంది అతని నటన చూస్తే… కుమార్ పాత్రలో నటించిన తను కూడా మంచి నటన కనబరిచాడు. మిగతా పాత్రధారులు ఎవరి పరిధిలో వాళ్లు నటించారు. కథ ముందుకెళ్లేందుకు సహకరించారు.కవలుధారి సినిమా కన్నడ లో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ త్రిల్లర్ మూవిగా ఉంటుంది. ఈ సినిమాని తెలుగులో కపటధారి పేరుతో సుమంత్ రీమేక్ చేశారు. ఇక్కడ కూడా మంచి టాక్ సంపాదించుకుంది.తమిళ్ లో కూడా సీబీరాజ్ కబడధారి పేరుతో రీమేక్ చేశారు.
Also Read:ఇలాంటి సీన్ పెట్టడం అవసరమా..?” అంటూ… వైష్ణవ్ తేజ్ “ఆదికేశవ” ట్రైలర్‌పై కామెంట్స్..!