“యాత్ర-2” సినిమాలో చంద్రబాబు నాయుడు పాత్రలో నటించబోతున్న… ఆ యాక్టర్ ఎవరో తెలుసా..?

“యాత్ర-2” సినిమాలో చంద్రబాబు నాయుడు పాత్రలో నటించబోతున్న… ఆ యాక్టర్ ఎవరో తెలుసా..?

by Mounika Singaluri

Ads

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గా వచ్చిన యాత్ర సినిమా అప్పట్లో ప్రేక్షకులను బాగానే అలరించింది. ప్రముఖ దర్శకుడు మహీ వి రాఘవ ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. వైయస్సార్ గా మమ్ముట్టి నటించగా ఆయన వైయస్సార్ పాత్రలో ఒదిగిపోయారు. 2019 ఎలక్షన్ల టార్గెట్ గా యాత్ర సినిమా వచ్చింది.

Video Advertisement

ఇప్పుడు 2024 ఎలక్షన్ లు దగ్గర పడటంతో మళ్ళీ ఈ సినిమాకు సీక్వెల్ తీసే పనులు దర్శకుడు మహి వీ రాఘవ ఉన్నారు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్రను ఆధారంగా చేసుకుని యాత్ర2 సినిమాని రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో జగన్మోహన్ రెడ్డి గా ప్రముఖ తమిళ హీరో జీవా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. 2024 ఫిబ్రవరి 8న ఈ సినిమాని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమాలో వైయస్ జగన్మోహన్ రెడ్డి తో పాటు ఇతర రాజకీయ నాయకుల్లో కూడా కనిపించనున్నారు. ఆయనతోపాటు మిగతా వైఎస్ఆర్సిపి నాయకులు, ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు కూడా ఈ సినిమాలో కనిపించనున్నట్లు తెలియజేస్తున్నారు.

అయితే చంద్రబాబు పాత్రకు సూట్ అయ్యే నటుడు కోసం వెతుకుతున్న చిత్ర యూనిట్ ప్రముఖ బాలీవుడ్ నటుడిని రంగంలోకి దించినట్లు తెలుస్తుంది. ప్రముఖ తెలుగు సినిమాలో నటించిన మహేష్ మంజరేకర్ ఈ సినిమాలో చంద్రబాబు పాత్రలో నటిస్తున్నట్లు గుసగుస వినిపిస్తుంది. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా జరుగుతున్నట్లు వినికిడి. ఏదేమైనా ఈ చిత్రం విడుదలయితే గాని ఇందులో ఎవరిని ఎలా చూపించారు అనే దానిపైన ఒక క్లారిటీ రాదు.మరోపక్క ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ వ్యూహం అంటూ ఆయన కూడా జగన్మోహన్ రెడ్డికి సపోర్టుగా సినిమాలను రూపొందిస్తున్నాడు ఈ సినిమాను కూడా త్వరలో విడుదల కానుంది.

Also Read:రామ్ గోపాల్ వర్మ పతనానికి కారణం ఏంటి..? అని ఓ నెటిజెన్ అడిగిన ప్రశ్నకి ఈ అబ్బాయి ఏమని సమాధానం ఇచ్చాడో తెలిస్తే మైండ్ బ్లాక్..!


End of Article

You may also like