కరోనా కాలంలో ఓటీటీలకు అలవాటైన ప్రేక్షకులు ఆ తరువాత థియేటర్లలో చూడాడానికి సినిమాలకు వస్తారా అనే ప్రశ్నలను, అనుమానాలను చెరిపేస్తూ రాజమౌళి ఆర్ ఆర్ ఆర్, కేజీఎఫ్ 2 చిత్రాలు 2022 బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల కలెక్షన్స్ సాధించి భారత సినిమా స్టామినాను పెంచాయి.
అయితే భారీ బ్లాక్ బస్టర్ లు అయిన కేజీఎఫ్ 2, RRR చిత్రాల బాక్సాఫీస్ కలెక్షన్స్ లో ఏ సినిమా టాప్ లో ఉంది. ఏ సినిమా తర్వాత అనేదానిపై ఇంకా ఊగిసలాట కొనసాగుతూనే ఉంది. ఈ సంవత్సరంలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన మూవీగా ఆర్ ఆర్ ఆర్ ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ ప్రశాంత్ నీల్,యశ్ కాంబినేషన్ లో వచ్చిన కేజీఎఫ్ 2 మూవీ 1000 కోట్లకు పైగా రాబట్టింది. కేజీఎఫ్ 2 సినిమా ఇటు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర, ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ కలెక్షన్స్ లో కూడా టాప్ ప్లేస్ లో నిలిచింది.
కాగా ఇటీవల ఆర్ ఆర్ ఆర్ జపాన్ లో రిలీజ్ అయ్యి, అక్కడ భారీ వసూళ్లు రాబడుతోంది. జపాన్ లో RRR సినిమా రాబడుతున్న కలెక్షన్స్ తో లెక్కలు మొత్తం మారిపోయాయి. ఈ సంవత్సరంలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా టాప్ ప్లేస్ లో ఆర్ ఆర్ ఆర్ నిలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక జపాన్ లో RRR రిలీజ్ కు ముందు వరకు కేజీఎఫ్ 2 సినిమానే 2022లో అత్యధిక వసూళ్లు నమోదు చేసిన సినిమాగా ఉంది.
కానీ ఇప్పుడు జపాన్ ప్రేక్షకుల వల్ల రాజమౌళి సినిమాకి ఆ రికార్డు దక్కింది. అయితే ఇప్పటి వరకు ఆర్ ఆర్ ఆర్ మూవీ 1200 కోట్ల కలెక్షన్స్ తెచ్చిందని తెలుస్తోంది. కాగా కేజీఎఫ్ 2 సినిమా 1200 కోట్లకు దగ్గరగా ఉన్నట్లు సమాచారం. అయితే కొంచెం తేడాతోనే ఆర్ ఆర్ ఆర్ టాప్ ప్లేస్ ను దక్కించుకుంది.ఇక కేజీఎఫ్ 2 సినిమా రెండవ స్థానంలో ఉంది.

కన్నడ చిత్రాలు పాన్ ఇండియా వైడ్ గా విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్నాయి. ‘కేజీయఫ్’తో రాకీభాయ్ దేశాన్నిషేక్ చేశాడు.‘కేజీయఫ్’ హిట్ ఒక ఎత్తైతే, ఆ తరువాత వచ్చిన ‘కేజీయఫ్ 2’ మరో లెవెల్. ఇక దీంతో కన్నడ సినీ పరిశ్రమ వెలిగిపోతోంది. అయితే తాజాగా ‘కేజీయఫ్’ రికార్డు ను కాంతార దాటేసింది. అయితే ఇక్కడ ఒక సందేహం రాకమానదు. ఎందుకంటే ‘కేజీయఫ్ 2’మూవీ వరల్డ్ వైడ్ గా రూ. 1250 కోట్లు సాధించింది. అయితే ఇక్కడ చెప్పేది కర్ణాటక రాష్ట్రంలోని కలెక్షన్స్ గురించి మాత్రమే.‘కేజీయఫ్ 2’మూవీ రూ.172 కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా వసూలు చేసింది.
తాజాగా ఆ కలెక్షన్స్ ను ‘కాంతార’ 60 రోజుల్లోనే క్రాస్ దాటేసిందట. ఇక దీంతో కన్నడ ఇండస్ట్రీలో ‘కాంతార’ మూవీనే టాప్. అయితే రెండు సినిమాలకు మధ్య చాలా తేడాలు ఉన్నాయి. కేజీయఫ్ 2 బడ్జెట్ రూ. వందల కోట్లలో ఉంటే, ‘కాంతార’ బడ్జెట్ రూ.16కోట్లు. కథనే నమ్ముకుని ‘కాంతార’ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఈ రెండు సినిమాలను నిర్మించింది హోంబలే ఫిల్మ్స్.



