వండేల్లో 50 సెంచరీలు చేసే ఆటగాడు ఉంటాడని ఎవరూ కలగని ఉండరు. గతంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 49 సెంచరీలు చేశాడు. సచిన్ రికార్డింగ్ అందుకునే ఆటగాడు ఎవరూ ఉండరని అనుకున్నారు. కానీ అనూహ్యంగా విరాట్ కోహ్లీ బరిలోకి వచ్చాడు. సచిన్ ఏ తనంతట తన రికార్డును బద్దలు కొట్టాలంటే విరాట్ కోహ్లీ కే సాధ్యమవుతుందని చెప్పాడు.
ప్రపంచ కప్ లో ఆ రికార్డులు కోహ్లీ చేసి చూపించాడు. 50 సెంచరీలు పూర్తిచేసి ప్రపంచ చరిత్రలో ఏ బ్యాట్స్ మెన్ కి లేని రికార్డును సృష్టించుకున్నాడు.ఇప్పుడు విరాట్ కోహ్లీ కన్ను మరో రికార్డు పై పడిందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.
అదే 100 సెంచరీలు. ఇప్పటివరకు క్రికెట్ చరిత్రలో 100 సెంచరీలు చేసిన ఆటగాడు కూడా సచినే కావడం గమనార్హం. సచిన్ టెండూల్కర్ తన కెరీర్ మొత్తంలోనూ అన్ని ఫార్మాట్లు కలిపి 100 సెంచరీలు పూర్తి చేశాడు. మళ్లీ సచిన్ రికార్డు బద్దలు కొట్టే అవకాశం కోహ్లీకి మాత్రమే ఉంది. కోహ్లీకి అన్ని ఫార్మాట్లు కలిపి 80 సెంచరీలు పూర్తి అయ్యాయి. ఇంకొక 20 సెంచరీల దూరంలో మరో మైలు రాయి నిలిచి ఉంది. ఎలా లేదన్న కోహ్లీకి ఇంకొక నాలుగు ఏళ్లు కెరీర్ మిగిలి ఉంది. ఈ నాలుగేళ్ల సమయంలో కోహ్లీ 20 సెంచరీలు చేయడం పెద్ద కష్టమేమీ కాదనీ ఇండియా మాజీ ఆటగాడు రవి శాస్త్రి అభిప్రాయపడ్డాడు.
ఏడాదికి ఐదు సెంచరీలు తరపున చూసుకున్న కూడా కోహ్లీ కెరీర్ పూర్తయ్యే సమయానికి వంద సెంచరీలు పూర్తి చేస్తాడని అన్నారు. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా మొదటి స్థానంలో సచిన్ ఉన్నాడు.నాలుగో స్థానంలో విరాట్ కోహ్లీ ఉన్నాడు. అయితే ఇద్దరి మధ్య 7879 పరుగులు తేడా ఉంది. ఈ నాలుగేళ్లలో ఈ పరుగులు కూడా పూర్తిచేసి నెంబర్ వన్ స్థానంలోకి కోహ్లీ వస్తాడని అభిమానులు కూడా అంచనా వేస్తున్నారు.
Also Read:మీకు ఏ రోహిత్ శర్మ కావాలి..?” అంటూ… అగ్గి రాజేసిన “శిఖర్ ధావన్” కామెంట్స్..! అసలు విషయం ఏంటంటే..?