ఒక వయసులో మనకు తొడన్నది ఎంతో అవసరం..మరి వృద్ధ వయసులో తోడు మరీ ముఖ్యం కుడా! 73 ఏళ్ల వయసులోని ఒక వృద్ధురాలు తనకు తోడు కావాలంటూ ప్రకటన ఇచ్చారు.. కర్ణాటక లోని మైసూరు కి చెందిన వృద్ధురాలికి వరుడు కావాలంటూ ప్రకటించుకోవడం చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేసారు,ఆమె వృత్తి రీత్యా గతంలో ఉపాధ్యాయురాలు గా పని చేసారు.గతంలో వివాహమయినప్పటికీ కూడా విడాకులు తీసుకుని భర్త నుంచి వేరయ్యారు.
also read : ఏపీ వాసులకి దడ పుట్టిస్తున్నకరోనా సెకండ్ వేవ్ గత 24 గంటల్లో ఎన్నికేసులు అంటే !
ఆమెకు సంతానం కూడా లేకపోగా ఆమె తల్లిదండ్రులు కూడా మరణించటంతో ఒంటరిగా జీవిస్తున్నారు.ఆమె ప్రస్తుత జీవితానికి ఒక తోడు ఎంతో ముఖ్యమని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారు.ఒంటరిగా జీవించటానికి భయమేస్తుందని తనకంటూ ఒక కుటుంబం ఉంటె బాగుంటుందని ఈ ప్రకటన చేసాననని చెప్పుకొచ్చారు,అయితే తానొక బ్రాహ్మణ స్త్రీనని తాను వివాహమాడబోయే అతను కూడా అదే కులానికి చెందిన వాడు తనకన్నా పెద్ద వయసున్నవాడు కావాలంటుంది..ఆమె తీసుకున్న నిర్ణయం సరైనదే అని పరులువురు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.
also read : ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఖాతాలో లోకి మరో పది రాఫెల్ యుద్ధ విమానాలు