ప్రస్తుతం మనం ఏదైనా ఒక ఫోన్ నెంబర్ ని ఉపయోగించాలి అంటే లేదా కొత్త నెంబర్ ని తీసుకోవాలని అంటే దానిని మన ఆధార్ తో లింక్ చేయటం తప్పనిసరి అయ్యింది ఈ నేపథ్యంలో చాలా మంది మన ఆధార్ ని ఉపయోగించి ఫేక్ నెంబర్ లు తీసుకోవడం లాంటి మోసాలకు పాల్పడుతున్నారు అయితే వినియోగదారులు పేస్ చేస్తున్న ఈ ప్రాబ్లంను అధిగమించడం కోసం DOT ( డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్ ) వినియోగదారులు తమ ఆధార్ తో ఎన్ని ఫోన్ నెంబర్లు లింక్ అయ్యి ఉన్నాయో తెలుసుకొనే సౌకర్యాన్ని తమ వెబ్సైట్లో అందుబాటులోకి తెచ్చింది.
ప్రతి వినియోగదారుడికి తమ ఆధార్ పై గరిష్టంగా 9 ఫోన్ నెంబర్ల వరకు ఉపయోగించుకునే అవకాశం ఉంది అంతకుమించి ఎక్కువ ఫోన్ నెంబర్లు వినియోగదారుని ఆధార్ కు లింక్ వున్నట్లయితే డాట్ నుండి ఆ వినియోగదారునికి మెసేజ్ వెళ్లడం జరుగుతుంది. ఒకవేళ వినియోగదారులు తమ ఆధార్ తో లింక్ అయ్యి ఉన్న ఫోన్ నెంబర్లు తెలుసుకోవాలి అనుకున్న, తమకు అవసరం లేని ఫోన్ నెంబర్లను తీసేయాలి అనుకున్నా డాట్ వాళ్లు వినియోగదారుల కోసం ప్రారంభించిన వెబ్సైట్ TAFCOP ( టెలికామ్ ఎనాలిటిక్స్ ఫర్ ఫ్రాడ్ అండ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ ) ద్వారా తెలుసుకోవచ్చు .
మొదటగా వినియోగదరులు tafcop.dgtelecom. gov. In అనే వెబ్సైట్ లోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది.
ఎంటర్ అయిన తర్వాత అక్కడ కనిపించే హోం పేజీలో ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్ అనే ప్లేస్ లో మీ ఆధార్‌తో లింక్ అయి ఉన్నా మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేసి రిక్వెస్ట్ ఓటిపి అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ కు ఒక ఓటిపి రావడం జరుగుతుంది మీరు ఆ OTP ని మీరు ఆ వెబ్ సైట్లో ఎంటర్ చేసిన వెంటనే మీ నెంబర్ పై ఉన్న మొత్తం ఫోన్ నెంబర్లు అనేవి మీకు కనిపించడం జరుగుతుంది అందులో ఏదైనా నెంబర్ మీకు అవసరం లేదు లేదా అ నెంబర్ మీరు ఉపయోగించడం లేదు అనుకుంటే అక్కడే క్రింద ఉన్న ఆప్షన్స్ లో This is not my number లేదా not required అనే ఆప్షన్స్ క్లిక్ చేసి మీరు ఆ నెంబర్ని రిపోర్ట్ చేసుకోవచ్చు. మీ రిపోర్ట్ కి సంబంధించి ఒక రిక్వెస్ట్ నెంబర్ జనరేట్ అవుతుంది అ నెంబర్ ఉపయోగించి మీ రిపోర్ట్ యొక్క ప్రోగ్రాస్ మీరు tafcof వెబ్సైటు లో చెక్ చేసుకోవచ్చు.