దేశం లో మరో సారి కరోనా మహమ్మారి విజృంబిస్తు ఉంది.రోజుకి 2 లక్షల మంది ఈ వ్యాధి భారిన పడుతున్నారు ఉత్తరాది రాష్ట్రాల్లో దీని తీవ్రత చాల ఎక్కువ గా ఉందనే చెప్పాలి ముఖ్యంగా మహారాష్ట్ర,గుజరాత్, దేశ రాజధాని ఢిల్లీ వ్యాధి తీవ్రత అధికంగా ఉంది.హాస్పిటల్ ల ముందు రోగులు పడిగాపులు కాస్తున్నారు మరో వైపు బెడ్లు కూడా దొరకని వైనం.
కొన్ని చోట్ల ఏకంగా బెడ్ ఇద్దరు ముగ్గురు కుడా ఉంటున్నారు.ఈ క్రమం లో గుజరాత్ లోని వడదొర నగరం లో ఒక మసీదుని కోవిడ్ సెంటర్ గా మార్చివేశారు.మసీదు నిర్వాహకులు ఇర్ఫాన్ షైక్ మాట్లాడుతూ కోవిడ్ కి విరుద్ధంగా ప్రభుత్వాలు చేస్తున్న పోరాటం లో తాము భాగస్వాములు అవ్వలని ప్రజలందరూ సహకరించాలని చెప్పారు.నగరం లో కరోనా తీవ్రత అధికంగా ఉందని హాస్పిటల్ లో బెడ్లు దొరక్క ఎంతో ఇబ్బందులు పడుతున్నారని వారి కోసం ఈ చిన్న ప్రయత్నం చేసాం అని చెప్పారు.