సినీ పరిశ్రమలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన వారందరూ ఆఖరి దశకు వచ్చేసరికి కష్టాల కడలిలో మునిగిపోయిన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. సినీ పరిశ్రమ అంటేనే అంత. వయసు, యవ్వనం ఉన్నంతకాలం అందులో రాణించి స్టార్ స్టేటస్ పొంది వయసు మళ్ళిన తర్వాత పట్టించుకునే నాధుడు లేక దిక్కుతోచని స్థితిలో గడిపిన వారు ఎందరో ఉన్నారు.
అలాంటి పరిస్థితి ఇప్పుడు ప్రముఖ నటి పావలా శ్యామలకు వచ్చింది. పావలా శ్యామల అంటే టక్కున గుర్తొచ్చే రూపం, తన మాట తీరు, తన యాస అందరిని ఆకట్టుకునే విధంగా ఉండేవి. అందుకనే ఎక్కువ శాతం దర్శకులు తమ సినిమాల్లో పావలా శ్యామలకు అవకాశాలు కల్పించేవారు.
ఖడ్గం, గోలీమార్ సినిమాల్లో పావలా శ్యామల నటనను మర్చిపోని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. 1984లో సినీ రంగ ప్రవేశం చేసిన పావలా శ్యామల ఇంద్ర, బ్లేడ్ బాబ్జి, స్వర్ణకమలం ఇలా సుమారు 250 సినిమాల్లో నటించింది. ఇప్పుడు అలాంటి పావలా శ్యామల చాలా దయనీయ జీవితం గడుపుతుంది. ఒకవైపు ఆర్థిక భారం మరోవైపు వయోభారం ఆమెకు నరకం చూపిస్తున్నాయి. ఎదిగి వచ్చిన కూతురు కూడా మంచానికే పరిమితం కావడంతో ఆమెకు అండగా ఉండేవారు లేక మనోవేదన చెందుతుంది. చిరంజీవి లాంటి వారు ఆర్థిక సహాయం అందించిన అవి తాత్కాలిక ఉపశమనం కల్పించాయి.
తినడానికి తిండి లేక తనకు వచ్చిన అవార్డులు అమ్ముకుని ఆ డబ్బులతో బియ్యం,పప్పులు కొనుక్కున్న రోజులు ఉన్నాయని కంటతడి పెట్టుకుంది.ఐదు రోజులు పస్తులు ఉన్నామని కనీసం అనారోగ్యంతో ఉంటే మందులు కొనుక్కునే స్థితి కూడా లేదని తెలిపింది. ఆ-త్మ-హ-త్య చేసుకునే ధైర్యం లేదని చెప్పిందంటేనే అర్థం చేసుకోవచ్చు ఆమె ఏ స్థితిలో ఉందో. ప్రస్తుతం పావలా శ్యామల ఫిర్జాదిగూడలోని ఓ వృద్ధాశ్రమంలో ఉంటుంది. ఆశ్రమానికి నెలవారి డబ్బులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని ఎవరైనా నాధులు తమను ఆదుకోవాలని వేడుకుంది.
Also Read:పోకిరి” నుండి “పుష్ప” వరకు… సమాజానికి “చెడు సందేశం” ఇచ్చిన 10 హిట్ సినిమాలు“